Nalgonda: భక్తి కాస్తా భయంగా మారింది.. నిప్పుల గుండంలో పడిపోయిన భక్తులు

Nalgonda: భక్తి కాస్తా భయంగా మారింది.. నిప్పుల గుండంలో పడిపోయిన భక్తులు
x

Nalgonda: భక్తి కాస్తా భయంగా మారింది.. నిప్పుల గుండంలో పడిపోయిన భక్తులు

Highlights

Nalgonda: నల్లగొండ జిల్లాలోని వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో జరుగుతున్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో పెను ప్రమాదం చోటుచేసుకుంది.

Nalgonda: నల్లగొండ జిల్లాలోని వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో జరుగుతున్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. భక్తిశ్రద్ధలతో నిర్వహించే అగ్నిగుండం ప్రవేశం కార్యక్రమంలో ఒక్కసారిగా జరిగిన తోపులాట భక్తుల పాలిట శాపంగా మారింది. ఈ ఘటనలో 11 మంది భక్తులు నిప్పుల గుండంలో పడి తీవ్రంగా గాయపడ్డారు.

ఆమనగల్లులో ఏటా జరిగే ఈ ఉత్సవాల్లో అగ్నిగుండం దాటే సంప్రదాయం ఎంతో ప్రసిద్ధి. ఈ ఏడాది కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు వరసగా నిప్పులపై నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా వెనుక నుంచి తోపులాట జరిగింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో నియంత్రణ కోల్పోయిన కొంతమంది భక్తులు నిప్పుల గుండంలో పడిపోయారు.

ప్రమాదాన్ని గమనించిన తోటి భక్తులు, గ్రామస్థులు వెంటనే అప్రమత్తమై నిప్పుల్లో పడిన వారిని బయటకు లాగారు. ఈ ప్రమాదంలో పదకొండు మందికి కాలిన గాయాలతో పాటు తోపులాటలో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

ప్రమాద విషయం తెలియగానే స్థానిక అధికారులు ఆసుపత్రికి చేరుకుని గాయపడిన వారిని పరామర్శించారు. ఉత్సవాల సమయంలో సరైన భద్రతా చర్యలు లేకపోవడం వల్లే ఈ తోపులాట జరిగిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ ఘటనతో ఆమనగల్లు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories