TS Corona Cases: తెలంగాణలో కొత్తగా 1,280 కరోనా కేసులు, 15 మంది మృతి

TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నేడు 1,280 కేసులు నమోదయ్యాయి.

Venkata Chari
Updated on: 13 Jun 2021 8:30 PM IST
1280 New Coronavirus Cases Reported in Tealngana on 11th June 2021
X

కరోనా టెస్ట్‌ (ఫొటో ట్విట్టర్)

TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 91,621 నమూనాలను పరీక్షించారు. ఇందులో 1వేయి280 మందికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 6లక్షల 03వేల 369 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తాజాగా రాష్ట్రంలో 15 మంది కరోనాతో మరణించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. కాగా, మొత్తం మరణాల సంఖ్య 3వేల484 కి పెరిగింది. ఈ రోజు 2వేల261 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 21,137 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది.

Venkata Chari

Venkata Chari

Next Story