రైతులకు షాక్..! 15 రోజుల పాటు యూరియా ఉత్పత్తి నిలిపివేత – కారణం ఇదే

రైతులకు షాక్..! 15 రోజుల పాటు యూరియా ఉత్పత్తి నిలిపివేత – కారణం ఇదే
x

రైతులకు షాక్..! 15 రోజుల పాటు యూరియా ఉత్పత్తి నిలిపివేత – కారణం ఇదే

Highlights

తెలంగాణ రైతులకు ఇది ఆందోళన కలిగించే వార్త. పెద్దపల్లిలోని రామగుండం ఎరువుల కర్మాగారం (RFCL) లో యూరియా ఉత్పత్తి తాత్కాలికంగా నిలిచిపోనుంది. అమోనియా పైపులైన్‌లో లీకేజీ కారణంగా, కర్మాగారం 15 రోజుల పాటు మూతపడనుంది.

తెలంగాణ రైతులకు ఇది ఆందోళన కలిగించే వార్త. పెద్దపల్లిలోని రామగుండం ఎరువుల కర్మాగారం (RFCL) లో యూరియా ఉత్పత్తి తాత్కాలికంగా నిలిచిపోనుంది. అమోనియా పైపులైన్‌లో లీకేజీ కారణంగా, కర్మాగారం 15 రోజుల పాటు మూతపడనుంది. దీంతో సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి దెబ్బతిననుంది, ఇది తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రైతులపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది.

15 రోజుల యూరియా బంద్ – రైతులకు పెరిగిన ఇబ్బందులు

ఇప్పటికే పలు సవాళ్లు ఎదుర్కొంటున్న రైతులకు, ఈ ఎరువుల కొరత కొత్త తలనొప్పిగా మారనుంది. RFCL ప్లాంట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు భారీ ఎత్తున యూరియాను సరఫరా చేస్తుంది. పైపులలో లీకేజీని సరిచేయడానికి ప్లాంట్‌ను 15 రోజుల పాటు మూసివేసి మరమ్మతులు చేపట్టాలని యాజమాన్యం నిర్ణయించింది.

రైతులపై ప్రభావం

వర్షాకాలం సమయంలో పంటల పెరుగుదలకు యూరియా అత్యవసరం. ఇలాంటి కీలక సమయంలో ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల రైతులు ఎరువుల కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్లాక్ మార్కెట్ దందా పెరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని సరఫరాను మెరుగుపరచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories