TS Corona Cases: తెలంగాణలో కొత్తగా 1,798 కరోనా కేసులు, 14 మంది మృతి

TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నేడు 1,798 కేసులు నమోదయ్యాయి.

Venkata Chari
Updated on: 10 Jun 2021 9:01 PM IST
1798 New Coronavirus Cases Reported in Tealngana on 10th June 2021
X

కరోనా వైరస్ (ఫొటో ట్విట్టర్)

TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,30,430 నమూనాలను పరీక్షించారు. ఇందులో 1వేయి798 మందికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 5లక్షల 98వేల 611 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తాజాగా రాష్ట్రంలో 14 మంది కరోనాతో మరణించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. కాగా, మొత్తం మరణాల సంఖ్య 3వేల440 కి పెరిగింది. ఈ రోజు 2,524 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 23,561 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది.



Venkata Chari

Venkata Chari

Next Story