నేడు గాంధీభవన్‌లో టి.కాంగ్రెస్‌ సీనియర్ల సమావేశం...

A meeting of TCongress Seniors at Gandhi Bhavan Today
x

నేడు గాంధీభవన్‌లో టి.కాంగ్రెస్‌ సీనియర్ల సమావేశం...

Highlights

Congress Meeting: ఠాక్రే, రేవంత్‌ తోపాటు ఎంపీలు, సీనియర్‌ నేతలు హాజరు

Congress Meeting: ఇవాళ గాంధీ భవన్‌లో టి.కాంగ్రెస్ నేతల సమావేశం జరగనుంది. సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే‌, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు హాజరుకానున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతతో పాటు పలు కీలక విషయాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహం, బీఆర్ఎస్‌ను ఎలా ఎదుర్కొవాలన్న దానిపై టి.కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. ఇప్పటికే ఓఆర్ఆర్,111 జీఓ ఎత్తివేతపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరగబోయే సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories