Aarogyasri: ఆగస్టు 31 నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేత.. కారణం ఇదే

Aarogyasri: ఆగస్టు 31 నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేత.. కారణం ఇదే
x

Aarogyasri: ఆగస్టు 31 నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేత.. కారణం ఇదే

Highlights

తెలంగాణలో పేదలు, మధ్యతరగతి ప్రజలకు వైద్యం అందిస్తున్న ఆరోగ్యశ్రీ సేవలు మరోసారి నిలిచిపోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (TANHA) ప్రకటన ప్రకారం ఈ నెల 31 అర్థరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్, ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద సేవలు నిలిపివేయాలని నిర్ణయించారు.

దీనికి కారణం ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,400 కోట్ల బకాయిలు ఇంకా విడుదల కాకపోవడమే. చిన్న, మధ్య తరహా ఆసుపత్రులు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ సేవలు కొనసాగించడం సాధ్యం కాదని అసోసియేషన్ స్పష్టం చేసింది.

గత జనవరిలో కూడా 10 రోజుల పాటు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఆ సమయంలో ప్రభుత్వం "బకాయిలను నాలుగు నెలల్లో క్లియర్ చేస్తాం, క్రమం తప్పకుండా చెల్లింపుల కోసం కమిటీ ఏర్పాటు చేస్తాం" అని హామీ ఇచ్చింది. అయితే ఆ హామీలు అమల్లోకి రాకపోవడంతో మళ్లీ సేవలు నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చిందని TANHA పేర్కొంది.

ప్రైవేట్ హాస్పిటల్స్ డిమాండ్లు:

రూ.1,400 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి.

ప్యాకేజీలను సవరించాలి.

చెల్లింపులు సకాలంలో జరగాలి.

ఏకపక్ష సర్క్యులర్లను నిలిపివేయాలి.

ఆరోగ్యశ్రీ, జర్నలిస్టుల–ఉద్యోగుల స్కీమ్స్‌ను వేరుగా చూడాలి.

TANHA అధ్యక్షుడు డా. వడ్డిరాజు రాకేష్ మాట్లాడుతూ, "బకాయిల సమస్య వల్ల అనేక హాస్పిటల్స్ మూతపడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదు. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది" అని తెలిపారు.

ప్రభుత్వం త్వరగా స్పందించకపోతే, పేదలకు కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోవచ్చని ఆయన హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories