Adi Srinivas: hmtv కథనానికి స్పందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Adi Srinivas: hmtv కథనానికి స్పందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
x

Adi Srinivas: hmtv కథనానికి స్పందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Highlights

Adi Srinivas: ప్రజాప్రభుత్వం అంటూ సీఎం నుంచి మంత్రుల వరకు ప్రతీ సందర్భంలో పదే పదే చెప్పుకుంటూ వస్తున్నా..

Adi Srinivas: ప్రజాప్రభుత్వం అంటూ సీఎం నుంచి మంత్రుల వరకు ప్రతీ సందర్భంలో పదే పదే చెప్పుకుంటూ వస్తున్నా.. అధికారులు మాత్రం ఇవేమీ పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. రాష్ర్ట, జిల్లా, నియోజకవర్గ స్థాయి అభివృద్ధి సమీక్షా సమావేశాల్లో ఉన్నతాధికారులు., ప్రజాప్రతినిధులు చెబుతున్న సూచనలు తమకేమీ పట్టనట్టుగా ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు.

తాజాగా సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి, ప్రభుత్వ పథకాలపై ప్రభుత్వ విప్ ఆధి శ్రీనివాస్, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధిపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఉద్యోగులు తమకేమీ పట్టనట్టుగా సెల్ ఫోన్ చాటింగ్ లో నిమగ్నమయ్యారు. ముఖ్యమైన సమావేశంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అభివృద్ధి సమీక్షా సమావేశంలో అధికారుల నిర్లక్ష్యం పేరుతో hmtv ప్రసారం చేసిన కథనంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. ఉద్యోగుల తీరుపై ఆది శ్రీనివాస్ మండి పడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories