Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. అత్తాపూర్‌లో న్యాయవాది దారుణ హత్య!

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. అత్తాపూర్‌లో న్యాయవాది దారుణ హత్య!
x
Highlights

Hyderabad: నగరంలోని రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో గల అత్తాపూర్‌లో పట్టపగలే ఘోరం జరిగింది.

Hyderabad: నగరంలోని రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో గల అత్తాపూర్‌లో పట్టపగలే ఘోరం జరిగింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఖదీర్‌ను దుండగులు వేటకొడవళ్లతో దాడి చేసి అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఆఫీసులోనే మాటు వేసి దాడి

పోలీసుల కథనం ప్రకారం.. సులేమాన్ నగర్‌లోని తన సొంత కార్యాలయంలో ఖదీర్ పనిలో నిమగ్నమై ఉండగా, హఠాత్తుగా చొరబడ్డ దుండగులు ఆయనపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. శరీరంపై పలుచోట్ల తీవ్రమైన గాయాలు కావడంతో ఖదీర్ అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి మరణించారు. దాడి చేసిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

కుటుంబ కలహాలే కారణమా?

సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. ప్రాథమిక విచారణలో భాగంగా, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి బావమరుదులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని ప్రాథమిక సమాచారం అందుతోంది.

నిందితుల కోసం గాలింపు

పోలీసులు ఘటనాస్థలి వద్ద ఉన్న సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories