ఆర్మూర్‌లో బీఆర్ఎస్ Vs కాంగ్రెస్: జీవన్–వినయ్ మాటల యుద్ధం

ఆర్మూర్‌లో బీఆర్ఎస్ Vs కాంగ్రెస్: జీవన్–వినయ్ మాటల యుద్ధం
x

ఆర్మూర్‌లో బీఆర్ఎస్ Vs కాంగ్రెస్: జీవన్–వినయ్ మాటల యుద్ధం

Highlights

ఆర్మూర్‌లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ జీవన్ రెడ్డి, వినయ్ రెడ్డి మధ్య మాటల యుద్ధం పీవీఆర్ అంటేనే పైసా వసూల్ రెడ్డి అంటున్న జీవన్ జీవన్ విమర్శలకు వినయ్ కౌంటర్ అటాక్

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ నాయకుడు జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు వినయ్ రెడ్డి పరస్పరం అవినీతి, అక్రమాలు, వసూళ్ల ఆరోపణలతో కాక రేపుతున్నారు. జీవన్ పదేళ్లుగా అవినీతి, భూకబ్జాలు, రుణ మోసాలు చేశారని వినయ్ మండిపడుతున్నారు. అదే స్థాయిలో జీవన్ కూడా ఎదురుదాడి చేస్తున్నారు. వినయ్ రెడ్డి అక్రమ వసూళ్లకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు జీవన్ రెడ్డి. స్థానిక రాజకీయాల్లో పెను సంచలనం రేపుతున్న ఆ ఇద్దరు నాయకుల మధ్య వివాదం.. ఆర్మూర్ ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపనుంది..? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండనున్నాయి..?


నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. సర్పంచ్ ఎన్నికల వేళ ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ఆర్మూర్ పట్టణంలో అవినీతి అక్రమాలపై ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. బిఆర్ఎస్‌కు చెందిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొద్దుటూరి వినయ్‌ రెడ్డి మధ్య మాటల యుద్ధం పీక్స్‌కు చేరింది. ఒకరిపై మరొకరు పోటాపోటీగా మీడియా సమావేశం పెట్టుకుని అవినీతి అక్రమల చిట్టా విప్పుతున్నారు. పీవీఆర్ అంటేనే పైసా వసూల్ రెడ్డి అంటూ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అటాకింగ్ మోడ్‌లో దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి అక్రమాలకు అడ్డా అని వాగ్బాణాలు సంధిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కనుసైగల్లో ఆర్మూర్‌లో విచ్చలవిడిగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. అధికారులను అడ్డంగా పెట్టుకుని అవినీతి బాగోతం చేస్తున్నారని అధికార పార్టీ ఇంచార్జిపై అగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ రాజు ఏసీబీకి చిక్కడమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. వినయ్ రెడ్డి అనుచరులు ఆర్మూర్‌లో ఇష్టారీతిగా వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. అభివృద్ధి పనుల్లో మొదట వినయ్ రెడ్డి అనుచరుల వాటా.. ఆ తర్వాతే ఏదైనా అన్న చందాన వ్యవహారం కొనసాగుతోందని ఆరోపించారు. ఇసుక దందా అక్రమ కట్టడాలపై వినయ్ రెడ్డికి డబ్బులు ముట్టందే పని కొనసాగడం లేదని విమర్శలు చేశారు.


జీవన్ రెడ్డి విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్ అటాక్ చేస్తున్నారు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్ రెడ్డి. 10ఏళ్లపాటు ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఆశన్నగారి జీవన్ రెడ్డి అవినీతి అక్రమాలు అందరికి తెలుసనీ చెప్పుకొచ్చారు. తాను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. జీవన్ రెడ్డి అనుచరులే మొరం మాఫియా కొనసాగిస్తున్నారని విమర్శించారు. హైదరాబాదుతోపాటు ఆర్మూర్ పట్టణంలో అసైన్డ్ భూములు ఆక్రమించుకున్న ఘరానా మోసగాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పది సంవత్సరాలుగా నియోజకవర్గంలో బెదిరింపులకు పాల్పడుతూ, అవినీతి అక్రమాల్లో జీవన్ రెడ్డి ఘనత వహించారని ఎదురుదాడి చేశారు వినయ్. పీసీసీ మహేష్ కుమార్ గౌడ్, సలహాదారు సుదర్శన్ రెడ్డిని విమర్శించే స్థాయి ఆర్మూర్ పాండుకు లేదని ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు సొంతంగా 11 ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు. జీవన్ మాల్ బాధితులు 10మందికి 40 లక్షల చొప్పున ఇవ్వాల్సి ఉందని, ఎస్ఎఫ్‌సీ నుంచి 20 కోట్ల రుణం తీసుకుని.. ఇంటిని అక్రమంగా తిరిగి రిజిస్ట్రేషన్ చేశారన్నారు- జీవన్ రెడ్డి బాధితులు వస్తే సీఎం వద్దకు తీసుకెళ్లి న్యాయం చేయిస్తామన్నారు.


ఇలా.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల విమర్శలు, ప్రతివిమర్శలతో ఆర్మూర్ పాలిటిక్స్ గరం గరంగా మారాయి. పరస్సరం ఒకరి గుట్టు మరొకరు రట్టు చేయడంతో రెండు పార్టీల కార్యకర్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories