Hyderabad: హైదరాబాద్‌ డీజీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

Hyderabad: హైదరాబాద్‌ డీజీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత
x

Hyderabad: హైదరాబాద్‌ డీజీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

Highlights

Hyderabad: హైదరాబాద్‌ డీజీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Hyderabad: హైదరాబాద్‌ డీజీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయ్యప్పమాల ధరించిన కంచన్‌బాగ్‌ ఎస్సై కృష్ణకాంత్‌కు మెమో జారీచేయడంపై అయ్యప్ప భక్తులు, బీజేపీ నేతలు మండిపడ్డారు. అయ్యప్ప దీక్షలో ఉన్న సిబ్బంది పట్ల పోలీస్‌శాఖ తీరు సరికాదంటూ అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. ఎస్సై కృష్ణకాంత్‌కు జారీచేసిన మెమోను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

డీజీపీ కార్యాలయం ముట్టడికి అయ్యప్ప స్వాములు, బీజేవైఎం నేతలు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో డీజీపీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు అయ్యప్పస్వాములు, బీజేవైఎం నేతలు. ఈ నేపథ్యంలో పోలీసులు, అయ్యప్ప మాలధారుల మధ్య తోపులాట జరిగింది. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories