Bandi Sanjay: రాహుల్ గాంధీ పర్యటనపై బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రాహుల్ గాంధీ పర్యటనపై బండి సంజయ్ సెటైర్లు
x

Bandi Sanjay: రాహుల్ గాంధీ పర్యటనపై బండి సంజయ్ సెటైర్లు

Highlights

Bandi Sanjay: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Bandi Sanjay: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ వస్తోంది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని, ఢిల్లీకి పంపాల్సిన 'వసూళ్ల మూటల'పై చర్చించేందుకేనని ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ సర్కార్ తీరుపై పలు విమర్శలు గుప్పించారు.

తెలంగాణ నుంచి ఢిల్లీకి నిధుల మూటలను పంపేందుకే కాంగ్రెస్ శిక్షణ తరగతులు నిర్వహిస్తోందని, అందులో భాగంగానే రాహుల్ గాంధీ ఇక్కడ పర్యటిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. రాహుల్ గాంధీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, హైడ్రా (HYDRAA) కూల్చివేతల వల్ల రోడ్డున పడ్డ బాధితులను పరామర్శించాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్లను కూలుస్తుంటే రాహుల్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఇటీవల హిందువులపై, ఆలయాలపై జరిగిన దాడుల ప్రదేశాలను రాహుల్ సందర్శించాలని కోరారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు పక్కన పెట్టి వాస్తవాలను చూడాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు ఏమైందని బండి సంజయ్ నిలదీశారు. రాహుల్ గాంధీ తన పర్యటనలో ముందుగా హామీల అమలుపై సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని, రాహుల్ పర్యటన కేవలం రాజకీయ డ్రామా అని బండి సంజయ్ కొట్టిపారేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories