R Krishnaiah: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

R Krishnaiah: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి
x

R Krishnaiah: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

Highlights

R Krishnaiah: స్థానిక సంస్థల్లో బీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడించారు.

R Krishnaiah: స్థానిక సంస్థల్లో బీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడించారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు అంగీకార యోగ్యం కాదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య చెప్పారు. హైకోర్టులో రిజర్వేషన్ల అంశంకు సంబంధించిన కేసు గెలిచే బలమైన ఆధారాలు ఉన్నాయని చెప్పారు.

పార్లమెంటులో ఇండియా కూటమికి 240 మంది ఎంపీలు ఉన్నప్పటికీ రిజర్వేషన్ల అంశంపై ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-D(6) ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని, అదే అధికారం మేరకు అసెంబ్లీలో చట్టం చేసినట్లు గుర్తుచేశారు. రిజర్వేషన్లపై తరచూ కోర్టుల నుండి వ్యతిరేక తీర్పులు వస్తున్నందున..రాజ్యాంగ బద్దత కల్పించడమే శాశ్వత పరిష్కారామని ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories