భద్రాచలం సర్పంచ్‌ ఎన్నికలకు మోక్షం.. 11ఏళ్ల తర్వాత జరుగుతున్న ఎలక్షన్

భద్రాచలం సర్పంచ్‌ ఎన్నికలకు మోక్షం.. 11ఏళ్ల తర్వాత జరుగుతున్న ఎలక్షన్
x
Highlights

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటిసారి భద్రాచలం గ్రామపంచాయతీకి ఎన్నికలు జరగబోతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటిసారి భద్రాచలం గ్రామపంచాయతీకి ఎన్నికలు జరగబోతున్నాయి.. మోగిన స్థానిక ఎన్నికల నగారాతో భద్రాచలం ప్రజల నిరీక్షణకు మోక్షం కలుగుతుంది. స్వయంపాలనకు ద్వారాలు తెరుచుకోవడంతో ఆశావహులు, ప్రజల్లో జోష్ వచ్చింది. భద్రాచలానికి సర్పంచ్ అంటే రెండో ఎమ్మెల్యే అంత క్రేజీ ఉండటంతో అన్ని పార్టీలు ఫోకస్ పెట్టారు.

11ఏళ్లుగా భద్రాచలం స్థానిక సంస్థల ఎన్నిలకు నోచుకోలేదు. ఎన్నికల షెడ్యూల్‌ భద్రాచలం సర్పంచ్‌ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి విడతలోనే భద్రాచలం స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న అధికారులు అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నారు. డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. లెక్కింపు తర్వాత గెలిచిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. పోటీ చేసేందుకు సర్పంచ్ అభ్యర్థి కోసం ఎస్టీ అన్‌ రిజర్వుడ్, 20 వార్డులకు ఎస్టి ఉమెన్ రిజర్వుడు 5, ఎస్టీ 5, ఉమెన్ రిజర్వుడు 5, అన్ రిజర్వుడు 5గా కేటాయించారు. ఎన్నికలు నిర్వహించేందుకు మొత్తం 60 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

దశాబ్ద కాలం తరువాత భద్రాచలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండడంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన శ్రీసీతారామ చంద్ర స్వామి దేవస్థానం ఉండటంతో పాటు,సుమారు అరవై వేల మంది ప్రజానీకం ఉన్న అతి పెద్ద గ్రామ పంచాయతీ భద్రాచలం. అర్ధిక వనరులు ఎక్కువగా ఉండటంతో భద్రాచలం సర్పంచ్ పదవికి క్రేజ్ ఉందతి. ఆశావాహుల్లో తీవ్ర పోటీ , ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఉత్సహంగా ఉన్న వారు ప్రధాన రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు ప్రారంభించారు. మరికొందరు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అత్యధికంగా గిరిజనులు ఉన్న ప్రాంతం కావటంతో వారికే ప్రాధాన్యత ఇవ్వాలనే వాదన తెరపైకి వచ్చింది. భద్రాచలం నియోజకవర్గంలో అన్నీ పార్టీలు తమ అభ్యర్ధులుగా గిరిజనులను మాత్రమే ప్రకటించే ఛాన్స్‌ ఉండాలంటున్నారు. ఏది ఏమైనా ఈసారి భద్రాచలంలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం నెలకొనడంతో పట్టణ వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories