అమీన్‌పూర్‌ కేసులో ట్విస్ట్.. బయటపడ్డ కన్నతల్లి బాగోతం..

అమీన్‌పూర్‌ కేసులో ట్విస్ట్.. బయటపడ్డ కన్నతల్లి బాగోతం..
x
Highlights

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ముగ్గురు చిన్నారుల మృతి కేసులో ట్విస్ట్ నెలకొంది. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి రజిత చంపినట్టు నిర్ధారణ అయింది.

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ముగ్గురు చిన్నారుల మృతి కేసులో ట్విస్ట్ నెలకొంది. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి రజిత చంపినట్టు నిర్ధారణ అయింది. వివాహేతర సంబంధమే ఇందుకు కారణంగా పోలీసులు గుర్తించారు. ఇటీవల జరిగిన టెన్త్‌క్లాస్‌ విద్యార్థుల గెట్‌ టు గెదర్‌లో ఓ యువకుడితో రజితకు పరిచయం ఏర్పడింది. అది కాస్త.. వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇందులో భాగంగా భర్త, పిల్లల అడ్డు తొలగించుకోవాలని భావించిన నిందితురాలు రజిత.. మార్చి 27న పెరుగులో విషం కలిపింది. అయితే.. వాటర్‌ ట్యాంక్‌ ద్వారా వాటర్‌ సప్లయ్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నా చెన్నయ్య.. ఆ రోజు పెరుగన్నం తినకుండా వాటర్‌ ట్యాంక్‌ తీసుకుని వాటర్‌ సప్లయ్‌కు వెళ్లిపోయాడు.

దీంతో ముగ్గురు పిల్లలు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్‌కు తల్లి రజిత పెరుగన్నం పెట్టింది. అర్ధరాత్రి చెన్నయ్య ఇంటికి వచ్చేసరికి ముగ్గురు పిల్లలు విగతజీవులుగా పడివున్నారు. తాను కూడా అస్వస్థతకు గురైనట్టు తల్లి రజిత నాటకం ఆడింది. తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతున్నట్టు భర్త చెన్నయ్యకు చెప్పడంతో.. హుటాహుటిన తనను స్థానిక ఆస్ప్రత్రికి తరలించాడు భర్త చెన్నయ్య. మొదట భర్త చెన్నయ్యపై అనుమానం వ్యక్తంచేసిన పోలీసులు.. విచారణ చేపట్టగా.. రజిత బాగోతం బయటపడింది. రజిత ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.


Show Full Article
Print Article
Next Story
More Stories