Ramchander Rao: కొండగట్టు ఆలయానికి షోకాజ్ నోటీసులు రావడం ఆందోళనకరం

Ramchander Rao: కొండగట్టు ఆలయానికి షోకాజ్ నోటీసులు రావడం ఆందోళనకరం
x
Highlights

Ramchander Rao: కొండగట్టు ఆలయ భూముల వివాదంపై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు రాంచందర్ రావు స్పందించారు.

Ramchander Rao: కొండగట్టు ఆలయ భూముల వివాదంపై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు రాంచందర్ రావు స్పందించారు. కొండగట్టు అంజన్న ఆలయానికి అటవీ శాఖ షోకాజ్ నోటీసులు ఆందోళనకరమన్నారు. ఆలయంపై చర్యలు తీసుకోవాలంటే.. హిందూ విశ్వాసాలపై దాడి చేసినట్టేనన్నారు. ఆలయానికి కేవలం 6 ఎకరాల భూమి పరిమితి ఉందన్న వాదన భక్తులను బాధిస్తోందన్నారు. ఆలయ పరిధిలోని వివాదాస్పద 6 ఎకరాల్లో అన్నదాన సత్రం, టాయిలెట్స్, వాటర్ ప్లాంట్, వేద పాఠశాలలు ఉన్నాయి. భక్తుల సౌకర్యాలకు కీలకమైన మౌలిక వసతులపై అటవీ శాఖ చర్యలు తీసుకోవడం అన్యాయమన్నారు.

ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 కింద కొండగట్టు ఆలయానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది అటవీశాఖ. వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మత పరమైన కట్టడాలకైనా కూల్చివేత అధికారం ఉందని ఆ నోటీసుల్లో పేర్కొంది. వివాదాస్పదం అవుతున్న ఆ 6 ఎకరాల్లో గిరి ప్రదక్షిణ, వాహన పూజలు, పార్కింగ్ 6 ఎకరాలతోనే ముడిపడి ఉందన్నారు. ఈ అంశంపై చర్యలు తీసుకుంటే పేద భక్తులే ఎక్కువగా నష్టపోతారని రాంచందర్‌రావు అంటున్నారు. భక్తుల విశ్వాసంతో ముడిపడి ఉన్న ఇలాంటి సున్నిత అంశంపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే ఆలయ భూముల హద్దులను స్పష్టంగా నోటిఫై చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రెవెన్యూ, ఎండోమెంట్, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ కలిసి ఓ పరిష్కారం చూపాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories