నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు: న్యాయవాదులు, సిబ్బంది పరుగులు.. హై అలర్ట్!

నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు: న్యాయవాదులు, సిబ్బంది పరుగులు.. హై అలర్ట్!
x

నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు: న్యాయవాదులు, సిబ్బంది పరుగులు.. హై అలర్ట్!

Highlights

Nampally CBI Court: నాంపల్లి సీబీఐ కోర్టులో బుధవారం ఒక్కసారిగా బాంబు కలకలం రేగింది.

Nampally CBI Court: నాంపల్లి సీబీఐ కోర్టులో బుధవారం ఒక్కసారిగా బాంబు కలకలం రేగింది. కోర్టు భవనంలో బాంబు ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు రావడంతో పోలీసులు, భద్రతా సిబ్బంది హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు. ఈ వార్తతో కోర్టు ప్రాంగణంలోని న్యాయవాదులు, సిబ్బంది మరియు కక్షిదారులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.

రంగంలోకి డాగ్ స్క్వాడ్.. తనిఖీలు ముమ్మరం

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు కోర్టు భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. లోపల ఉన్న ప్రతి ఒక్కరినీ వెలుపలికి పంపి, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రతి గదిని, మూలమూలలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అయితే ఇది కేవలం ఆకతాయిల పని (Hoax Call) నా? లేక నిజంగానే పేలుడు పదార్థాలు ఉన్నాయా? అన్నది తనిఖీలు ముగిస్తే తప్ప చెప్పలేమని అధికారులు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories