శంషాబాద్ ఎయిర్‌పోర్టు‌కు బాంబు బెదిరింపు

శంషాబాద్ ఎయిర్‌పోర్టు‌కు బాంబు బెదిరింపు
x
Highlights

: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది.

హైదరాబాద్: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కస్టమర్ సపోర్ట్ సెంటర్ మెయిల్‌కు ఓ ఆగంతకుడు బాంబు బెదిరింపు మెయిల్ పంపాడు. దీంతో, నెదర్లాండ్ వెళ్లే ఓ ఫ్లైట్‌ను విమానయాన అధికారులు అత్యవసరంగా ల్యాండ్ చేశారు

నెదర్లాండ్ విమానంలో బాంబు పెట్టినట్టు ఎయిర్‌పోర్ట్‌ అధికారులకు వచ్చిన మెయిల్ లో ఉంది. దీంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సదరు ఫ్లైట్‌ను అత్యవసర ల్యాండింగ్ చేసి, విమానం మొత్తం ముమ్మరంగా తనిఖీ చేశారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ఈ నెల 9న కూడా ఓ బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. అమెరికా వెళ్లే విమానంలో బాంబు పెట్టినట్లు ఆ మెయిల్ లో పేర్కొన్నారు. బాంబు పేలకూడదంటే మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మెయిల్‌తో అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు ఐసోలేషన్‌ బే దగ్గర ఫ్లైట్‌ని ఉంచి పూర్తి స్థాయిలో తనిఖీ చేశారు. ఆ మెయిల్ న్యూయార్క్‌ నుంచి వచ్చినట్టు గుర్తించారు. ఆ విమానంలో ఏమీలేదని సెక్యూరిటీ సిబ్బంది నిర్ధారించారు. ఈ ఏడాదిలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి 20కిపైగా బెదిరింపు కాల్స్‌, మెయిల్స్‌ వచ్చాయి. 5 ఘటనల్లో నిందితులను గుర్తించారు. మిగతా కేసుల్లో విచారణ కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories