KCR: రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌ సంక్రాంతి శుభాకాంక్షలు

KCR: రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌ సంక్రాంతి శుభాకాంక్షలు
x
Highlights

KCR: బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

KCR: బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పర్వదినాలతో సంక్రాంతి పండుగ సంప్రదాయబద్ధంగా, వైభవంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పండుగ సందర్భంగా గ్రామాలన్నీ రంగవల్లులు, గొబ్బెమ్మలతో కళకళలాడుతూ ప్రకృతి సౌందర్యాన్ని సంతరించుకుంటాయని చెప్పారు. సంక్రాంతి శోభతో రాష్ట్రవ్యాప్తంగా ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

దక్షిణాయనం నుంచి ఉత్తరాయనానికి సూర్యుడు ప్రవేశించే మకర సంక్రాంతి హిందూ శాస్త్రాలు, పురాణాల్లో ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన పర్వదినమని కేసీఆర్ తెలిపారు. తన పదేళ్ల పాలనలో తెలంగాణలో సాధించిన వ్యవసాయ అభివృద్ధిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతాంగ సంక్షేమం మళ్లీ గాడిన పడుతూ తెలంగాణ సుభిక్షంగా, సంతోషంగా వర్ధిల్లాలని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఆకాంక్షించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories