Telangana: టీకా పేరుతో మోసం

Telangana: హైదరాబాద్‌లో ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ టీవీ ఛానల్‌ను నాగార్జున రెడ్డి అనే వ్యక్తి కరోనా టీకా పేరుతో మోసం చేశాడు.

Venkata Chari
Updated on: 14 Jun 2021 11:00 PM IST
Cheater Cheats TV Channel in Hyderabad
X

కరోనా టీకా (ఫొటో ట్విట్టర్)

Telangana: హైదరాబాద్‌లో ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ టీవీ ఛానల్‌ను నాగార్జున రెడ్డి అనే వ్యక్తి కరోనా టీకా పేరుతో మోసం చేశాడు. మంత్రి కేటీఆర్‌ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నానని, రూ.100కే టీకా వేస్తామని సదరు టీవీ ఛానల్‌తో బేరం కుదుర్చుకున్నాడు.

దీంతో సదరు సంస్థలోని 1,500 మంది సిబ్బందికి టీకాలు వేయించేందుకు యాజమాన్యం రూ.1.5 లక్షలు చెల్లించింది. డబ్బులు చెల్లించిన తర్వాత ఈ వ్యక్తి నుంచి స్పందన లేకపోవడంతో సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు నాగార్జునరెడ్డిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.

Venkata Chari

Venkata Chari

Next Story