భార్య వదిలివెళ్లిందన్న ఆక్రోశం.. పొరుగు దంపతుల ప్రాణాలు తీసిన పార్థసారథి!

భార్య వదిలివెళ్లిందన్న ఆక్రోశం.. పొరుగు దంపతుల ప్రాణాలు తీసిన పార్థసారథి!
x

భార్య వదిలివెళ్లిందన్న ఆక్రోశం.. పొరుగు దంపతుల ప్రాణాలు తీసిన పార్థసారథి!

Highlights

Chennai ECR Murder Case: తమిళనాడు రాజధాని చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ECR) ప్రాంతం ఘోర హత్యోదంతంతో ఉలిక్కిపడింది.

Chennai ECR Murder Case: తమిళనాడు రాజధాని చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ECR) ప్రాంతం ఘోర హత్యోదంతంతో ఉలిక్కిపడింది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి ఇరుగుపొరుగు దంపతులపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీశాడు. కానత్తూర్‌ రెడ్డి కుప్పం ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా పెను కలకలం సృష్టించింది.

కథనం ప్రకారం:

కానత్తూర్‌కు చెందిన పార్థసారథి(42) భార్య జమునతో రెండేళ్ల క్రితం గొడవపడి విడిపోయాడు. ప్రస్తుతం జమున తన పిల్లలతో కలిసి సైదాపేటలో ఉంటోంది. అయితే, తన భార్య తనను వదిలి వెళ్లడానికి ఎదురింట్లో ఉండే సుశీల్(35) కారణమని పార్థసారథి బలంగా నమ్మాడు. తన భార్యకు, సుశీల్‌కు మధ్య వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో అతనిపై గత కొంతకాలంగా పగ పెంచుకున్నాడు.

పార్కింగ్ వివాదంతో మొదలై.. ప్రాణాలు తీసే వరకు..

సోమవారం సాయంత్రం వాహనం పార్కింగ్ విషయంలో సుశీల్ భార్య గిరిజ(29)తో పార్థసారథికి తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అప్పటికే పాత కక్షలతో రగిలిపోతున్న పార్థసారథి, ఆవేశంతో ఇంట్లోకి వెళ్లి కత్తిని తీసుకొచ్చాడు. కళ్లెదుటే ఉన్న సుశీల్, గిరిజ దంపతులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలైన దంపతులు రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

అనాథలైన చిన్నారులు:

ఈ కిరాతక దాడిలో మరణించిన సుశీల్, గిరిజ దంపతులకు ఏడు మరియు నాలుగేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. కళ్లెదుటే తల్లిదండ్రులు హత్యకు గురవ్వడంతో చిన్నారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడు పార్థసారథిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories