Suryapet: ఎల్లాపురం తండాలో శిశు విక్రయం కలకలం

Suryapet: ఎల్లాపురం తండాలో శిశు విక్రయం కలకలం
x
Highlights

Suryapet: పసికందును నవమాసాలు కడుపులోనే మోసింది ఆ తల్లి. కానీ ఆ బిడ్డపై ఆమెకి కడుపు తీపి కలగలేదు.

Suryapet: పసికందును నవమాసాలు కడుపులోనే మోసింది ఆ తల్లి. కానీ ఆ బిడ్డపై ఆమెకి కడుపు తీపి కలగలేదు. తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను అంగట్లో సరుకులాగా అమ్మకానికి పెట్టింది. కడుపున పుట్టిన బిడ్డను నిర్ధయగా నిర్ధాక్షిణ్యంగా దళారులతో బేరాలు ఆడింది. అప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్న ఆ తల్లికి నాలుగోసారి ఆడపిల్లనే పుట్టింది. నాలుగో సంతానం ఆడపిల్లే కావడంతో పోషణకు అవస్థలు పడుతున్న ఆ కుటుంబాన్ని దళారులు చుట్టుముట్టారు. తల్లితో కలిసి ముఠా ఆ పసికందును విక్రయించేందుకు సిద్ధం అయ్యింది.

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం ఎల్లాపురం తండాలో శిశు విక్రయాలు జోరందుకున్నాయి. పేద గిరిజన తండాలే టార్గెట్‌‌గా దళారులు దందాను కొనసాగిస్తున్నారు. తండాలోని ఓ పేద గిరిజన దంపతులకు నలుగురు ఆడపిల్లల సంతానం మూడు, నాలుగో సంతానం కూడా ఆడపిల్లలే కావడంతో ఆ పసికందులను అమ్ముకునేందుకు ఆ తల్లి నిర్ణయించుకుంది. ఆడపిల్ల పుట్టిందనే వివక్ష, పేదల ఆర్థిక అవసరాలను క్యాష్ చేసుకుంటున్న ముఠా తండాలోని ‎శిశువులను గుట్టుచప్పుడు కాకుండా ఏపీలోని పలు ప్రాంతాలకు విక్రయిస్తున్నారు.

పసికందులను అమ్మేందుకు దళారులు రాగా తమ చెల్లెల్లను అమ్మొద్దంటూ పెద్ద పిల్లలు వారి కాళ్లపై పడి వేడుకున్నారు. అయినా కరగని ఆ తల్లిమనసు మమకారాన్ని చంపుకుని శిశువును అమ్మేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories