డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కేంద్రం ఆంక్షలతో 40 వేల కోట్ల ఆదాయం..

CM KCR Announces Winter Assembly Session in December
x

డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కేంద్రం ఆంక్షలతో 40 వేల కోట్ల ఆదాయం..

Highlights

Assembly Session: కేంద్రం, తెలంగాణ రాష్ట్రం మధ్య ఉప్పునిప్పులా ఉన్న సంబంధాలు మరింత వేడెక్కేలా కనిపిస్తున్నాయి.

Assembly Session: కేంద్రం, తెలంగాణ రాష్ట్రం మధ్య ఉప్పునిప్పులా ఉన్న సంబంధాలు మరింత వేడెక్కేలా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇటు సిట్ ఎంక్వైరీతో బీజేపీ నేతలను ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ చేయగా.. అటు ఐటీ రైడ్స్‎తో కేంద్రం కాకపుట్టించింది. ఓవైపు ఈడీ ఐటీ రైడ్స్ మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసుతో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మటాల తూటాలు పేలుతున్నాయి. మునుగోడు ఉపఎన్నిక తర్వాత కూడా ఈ టెంపో కొనసాగుతోంది. పరిస్థితులు చూస్తుంటే కేంద్రం, రాష్ట్రం మధ్య సత్సంబంధాలు నెలకొనే పరిస్థితులు కనిపించడం లేదు. ఇదే క్రమంలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కేంద్రం తీరును ఎండగట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు.

ఇందుకోసం అసెంబ్లీ సెషన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. డిసెంబర్‎లో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్స్‎లో కేంద్రం రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతోందనే అంశాలపైనే ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనవసర ఆంక్షలు విధిస్తోందని ఎండగట్టే అవకాశం ఉంది. ఫలితంగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు సమకూరవలసిన ఆదాయంలో 40 వేల కోట్ల రూపాయలకు పైగా తగ్గుదల చోటుచేసుకుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇటువంటి చర్యలతో తెలంగాణ అభివృద్ధిని ముందుకు సాగకుండా కేంద్రం అడ్డుకట్ట వేస్తోదని రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు డిసెంబర్‎లో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి KCR నిర్ణయించారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్ రావుతో పాటు శాసన సభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్‎రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories