KCR Questions Modi: కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు మోడీ ఏం చెబుతారు..?

*నల్లధనం తీసుకొచ్చి ఒక్కొక్కరికి 15 లక్షలు ఎప్పుడు ఇస్తారు?

Rama Rao
Published on: 3 July 2022 5:32 PM IST
CM KCR Questions PM Narendra Modi | TS News
X

KCR Questions Modi: కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు మోడీ ఏం చెబుతారు..?

KCR Questions Modi: కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు మోడీ ఏం చెబుతారు..? బహిరంగ సభలో కేసీఆర్ క్వశ్చన్స్ కు ప్రధాని సమాధానం చెబుతారా..? ప్రస్తుతం ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ మధ్య పొలిటికల్ వార్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో రెండు పార్టీల నాయకుల మధ్య వివాదాలు భగ్గుమంటున్న వేళ మోడీ సమాధానం ఏం చెబుతారనే విషయం ఉత్కంఠగా మారింది. అయితే కేసీఆర్ ఏ ప్రశ్నలేశారు..? ఓసారి చూస్తే..

దేశంలో 4 వేలకు టన్ను దొరికే బొగ్గును మోడీ మిత్రుల కోసం 25 వేల నుంచి 30 వేల వరకు పెట్టి ఎందుకు కొనుగోలు చేస్తున్నారో చెప్పాలని కేసీఆర్ ప్రశ్నించారు. శ్రీలంకలో మోడీ మిత్రుడి కోసం పవర్ ప్రాజెక్టు కట్టబెట్టేందుకు సేల్స్ మెన్ గా దిగజారిపోయారన్నారు. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ అధ్వానంగా ఎందుకు తయారైందో చెప్పాలన్నారు. అలాగే రైతు చట్టాల్ని ఎందుకు వెనక్కి తీసుకున్నారన 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయని అడిగారు. అలాగే నల్లధనం వెనక్కి తీసుకొచ్చి ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు ఎప్పుడు వేస్తారని కేసీఆర్ ప్రశ్నించారు. దీంతో కేసీఆర్ ప్రశ్నలకు మోడీ సమాధానాలు చెబుతారా..? లేదా..? అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Rama Rao

Rama Rao

Next Story