Revanth Reddy: రేపు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం

Revanth Reddy: రేపు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం
x

Revanth Reddy: రేపు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం

Highlights

Revanth Reddy: సచివాలయంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లా కలెక్టర్లతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

Revanth Reddy: సచివాలయంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లా కలెక్టర్లతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ పాలనను ప్రజల చెంతకు చేర్చడమే లక్ష్యంగా.. ఈ నెల మార్చి 6 నుంచి జూన్ 12 వరకు మొత్తం 99 రోజుల పాటు ఈ ప్రత్యేక కార్యక్రమం కొనసాగనుంది. ఎన్నికల హామీల అమలు, సంక్షేమ పథకాల పంపిణీ, క్షేత్రస్థాయిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడం ఈ ప్రణాళిక యొక్క ప్రధాన ఉద్దేశంగా పెట్టుకున్నారు.

99 రోజుల కాలంలో జిల్లాల వారీగా యంత్రాంగం ఎలా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు సూచించనున్నారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను ఎలా పరిష్కరించాలి అనే అంశాలపై సమీక్షించనున్నారు. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడటం, స్థానిక అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించడంపై డిస్కస్ చేయనున్నారు. ఈ సమావేశంలో సీఎస్ రామకృష్ణా రావు, వివిధ శాఖల మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఉన్నతాధికారులు పాల్గొని, జిల్లాల వారీగా ఉన్న ప్రగతి నివేదికలను పరిశీలించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories