Telangana: కొనసాగుతోన్న ఉన్నత విద్యాసంస్థల బంద్.. సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు భేటీ

Telangana: కొనసాగుతోన్న ఉన్నత విద్యాసంస్థల బంద్.. సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు భేటీ
x
Highlights

Telangana: తెలంగాణలో ఉన్నత విద్యాసంస్థలు నిరవదిక బంద్ పాటిస్తున్నాయి.

Telangana: తెలంగాణలో ఉన్నత విద్యాసంస్థలు నిరవదిక బంద్ పాటిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్ మెంట్‌ బకాయిలు చెల్లించాలన్న డిమాండ్‌తో.. పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పార్మసీ, నర్సింగ్, లా, మేనేజ్మెంట్ , బీఈడీ ప్రైవేట్ కాలేజీలు మూసి వేస్తున్నట్టు విద్యాసంస్థల సంఘాల సమాఖ్య ప్రకటించింది. అర్ధరాత్రి వరకు డిప్యూట సీఎం ప్రైవేట్ కళాశాల యజమాన్యాలతో చర్చలు జరిపినా బంద్ విషయంలో వెనక్కి తగ్గలేదు.

దాంతో సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. కాలేజ్ యాజమాన్యాలతో జరిపిన చర్చల వివరాలను తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం డిమాండ్ల పరిష్కారంలో సానుకూలంగా ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories