Revanth Reddy: ఉస్మానియా వర్సిటీని ఆక్స్‌ఫర్డ్‌ స్థాయిలో అభివృద్ధి చేస్తా

CM Revanth Reddy Vows to Develop Osmania University as Oxford-Level Institution
x

Revanth Reddy: ఉస్మానియా వర్సిటీని ఆక్స్‌ఫర్డ్‌ స్థాయిలో అభివృద్ధి చేస్తా

Highlights

Revanth Reddy: ఉస్మానియా వర్సిటీ పేరు వినగానే తెలంగాణ గుర్తుకొస్తుందని, ఈ రెండూ అవిభక్త కవలల్లా ఉన్నాయన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

Revanth Reddy: ఉస్మానియా వర్సిటీ పేరు వినగానే తెలంగాణ గుర్తుకొస్తుందని, ఈ రెండూ అవిభక్త కవలల్లా ఉన్నాయన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో రూ.90 కోట్లతో నిర్మించిన దుందుభి, బీమా వసతి భవనాలను ప్రారంభించారు. అలాగే డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్‌లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌, వేమ నరేందర్‌రెడ్డి, కోదండరామ్‌, వీసీ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉస్మానియా వర్సిటీ గొప్పతనం

సీఎం రేవంత్ మాట్లాడుతూ –

“పీవీ నరసింహారావు, చెన్నారెడ్డి, జైపాల్‌రెడ్డి వంటి మహానేతలు ఉస్మానియా వర్సిటీ నుంచి వెలిశారు.

తెలంగాణలో ప్రతి ఉద్యమానికీ పురిటిగడ్డగా నిలిచింది ఈ యూనివర్సిటీ.

చదువుతో పాటు పోరాట స్ఫూర్తిని కూడా నేర్పింది. యాదయ్య వంటి విద్యార్థులు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారు.

ఈ వర్సిటీ దేశానికి ఎన్నో ఐఏఎస్‌, ఐపీఎస్‌లను అందించింది.

కాంగ్రెస్ పాత్ర

వందేళ్ల చరిత్రలో ఉస్మానియా వర్సిటీకి దళిత వీసీని నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వమే.

గత పాలకులు కుట్రపూరితంగా ఓయూను నిర్వీర్యం చేయాలని ప్రయత్నించారని విమర్శించారు.

తాను ముఖ్యమంత్రిగా అయ్యాక సామాజిక బాధ్యతగా అన్ని విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించానని తెలిపారు.

విద్యార్థులకు హామీలు

“విద్యార్థులకు నేను ఇచ్చేది నాణ్యమైన విద్య మాత్రమే. తలరాతలు మార్చేది చదువే.

ఉస్మానియా వర్సిటీ చదువులకు మాత్రమే కాకుండా పరిశోధనలకు వేదిక కావాలి.

డిసెంబర్‌లో ఆర్ట్స్ కళాశాల వద్ద సభ పెడితే నేను వస్తాను. అన్ని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తాను.

ఒక పోలీసు కూడా క్యాంపస్‌లో ఉండకూడదు. విద్యార్థులు నన్ను ప్రశ్నిస్తే చిత్తశుద్ధితో సమాధానం ఇస్తాను.

ఉస్మానియా వర్సిటీని ఆక్స్‌ఫర్డ్ స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధం. నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి ప్రణాళికలు సిద్ధం చేయండి. అవసరమైన నిధులు ప్రభుత్వం సమకూరుస్తుంది’’ అని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories