ఆదిలాబాద్‌లో పత్తి కొనుగోళ్ల మోసం – రూ.175 కోట్ల లాభం దండుకున్న జిన్నింగ్ మిల్లర్లు

ఆదిలాబాద్‌లో పత్తి కొనుగోళ్ల మోసం – రూ.175 కోట్ల లాభం దండుకున్న జిన్నింగ్ మిల్లర్లు
x

ఆదిలాబాద్‌లో పత్తి కొనుగోళ్ల మోసం – రూ.175 కోట్ల లాభం దండుకున్న జిన్నింగ్ మిల్లర్లు

Highlights

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోల్‌మాల్ గత సీజన్‌లో జిన్నింగ్ మిల్లర్ల మాయజాలం సీసీఐకి 35లక్షల క్వింటాళ్ల పత్తి అమ్మకం

దళారుల పంట పండుతోంది. పత్తి కొనుగోళ్లలో మాయజాలం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐకి కుచ్చుటోపి పెట్టిన కాటన్ చీటింగ్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. విజిలెన్స్ విచారణ జరిపినా చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమాల్లో కీలకంగా ఉన్న వ్యక్తుల బండారం బయటపెట్టాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.


గత పత్తి సీజన్‌లో ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ పత్తి కొనుగోళ్ల ఘరానా మోసంపై విచారణ ఎటు తేలలేదు. గత సీజన్‌లో పత్తి తేమ శాతం పేరిట కొర్రీలు పెట్టి అధికారులు 8శాతం నుండి 12 శాతం తేమ ఉన్న పత్తినే కొనుగోలు చేశారు. కొంతమంది సీసీఐ, మార్కెట్, ప్రైవేట్ జిన్నింగ్ మిల్లుల యజమానులు, వ్యాపారులు కుమ్మక్కై దోపిడీకి తెరలేపారు. పత్తి మైచర్ ఎక్కువగా ఉందని సీసీఐ అధికారులు చెప్పడంతో ప్రైవేటు వ్యాపారులు నిర్ణయించిన ధరకు అమ్ముకుని నష్టపోయారు. గత సంవత్సరం పత్తి క్వింటాకు మద్దతు ధర 7,521 ఉండగా.. వెయ్యి రూపాయలు తగ్గించి కొనుగోలు చేశారు. అదే పత్తిని రైతుల పేరిట సీసీఐకి క్వింటాలుకు వెయ్యి లాభంతో బదలాయింపు చేశారు. టీఆర్‌ను జిన్నింగ్ మిల్లర్లు, ట్రేడర్లు , దళారులు వినియోగించుకుని సొమ్ము చేసుకున్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు లేకుండా సాగు దృవీకరణ పత్రాలతో సీసీఐ కొనుగోలు చేసిన పత్తి 35లక్షల క్వింటాళ్లుగా లెక్క తేలింది. ఈ పత్తిని సీసీఐ క్వింటాకు 7,521 రూపాయలకు దళారులు, వ్యాపారుల నుంచి కొనుగోలు చేసింది.


60 వేల టీఆర్‌లపై 35 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐకి అమ్మి 175 కోట్ల రూపాయల లాభాన్ని జిన్నింగ్ మిల్లర్లు పొందారు. గత మార్చి, ఏప్రిల్ నెలల్లో విజిలెన్స్ విచారణ చేపట్టినా ఇప్పటి వరకు సదరు వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ స్కామ్‌లో కొంతమంది రాజకీయ నేతల ప్రమేయం ఉందని తెలుస్తోంది. ఇటు విచారణ సమసిపోయిందని ప్రచారం జరుగుతుంది. తాజాగా మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పత్తి అక్రమాల వ్యవహారంలో ఉన్న వ్యక్తుల పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.


ఈ సీజన్ పత్తి కొనుగోళ్లు ప్రారంభంకావడం, విజిలెన్స్ విచారణలో ఉన్న జిన్నింగ్ మిల్లుల్లో మళ్లీ సీసీఐ టెండర్లు ద్వారా లీజుకు తీసుకోవడంపై చర్చ సాగుతోంది..ఏదిఏమైనా గత సీజన్ కోట్ల రూపాయల్లో జరిగిన పత్తి కొనుగోళ్ల అక్రమాలపై విచారణ వేగవంతం చేసి చర్యలు తీసుకోవాలని రైతులు, రాజకీయ పక్షాల నేతలు డిమాండ్ చేస్తున్నారు…

Show Full Article
Print Article
Next Story
More Stories