Danam Nagender: ఎన్నికలంటే భయం లేదు.. బీఆర్‌ఎస్‌ యాక్షన్‌ను బట్టి నా రియాక్షన్‌

Danam Nagender: ఎన్నికలంటే భయం లేదు.. బీఆర్‌ఎస్‌ యాక్షన్‌ను బట్టి నా రియాక్షన్‌
x
Highlights

Danam Nagender: అనర్హత వేటు వ్యవహారంలో స్పీకర్ జారీ చేసిన నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు.

Danam Nagender: అనర్హత వేటు వ్యవహారంలో స్పీకర్ జారీ చేసిన నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, చట్టపరమైన ప్రక్రియపై వివరణ ఇస్తూనే బీఆర్‌ఎస్ పార్టీకి పరోక్షంగా సవాల్ విసిరారు.

అడ్వకేట్ ద్వారా వివరణ:

స్పీకర్ కార్యాలయం నుంచి అందిన నోటీసులకు తమ తరపు న్యాయవాది ఇప్పటికే వివరణ ఇస్తూ లేఖ రాశారని దానం వెల్లడించారు. అయితే, ఆ లేఖకు స్పీకర్ నుంచి ఇంకా ఎటువంటి తిరుగు సమాధానం రాలేదని ఆయన పేర్కొన్నారు. "విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని నాకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. మా అడ్వకేట్ లేఖలో ఏ అంశాలను ప్రస్తావించారో నాకు పూర్తిస్థాయిలో తెలియదు" అని ఆయన స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్‌తో సంబంధాలపై క్లారిటీ

పార్టీ మార్పుపై వస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. "బీఆర్‌ఎస్ పార్టీ నన్ను ఇప్పటి వరకు అధికారికంగా సస్పెండ్ చేయలేదు. వారు తీసుకునే చర్యల ఆధారంగానే నా తదుపరి స్పందన ఉంటుంది. ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నాకు ఎన్నికలంటే భయం లేదు" అని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories