Bandi Sanjay: ఢిల్లీ ఎన్నికలు.. దూసుకుపోతున్న బీజేపీ..చీపురుతో ఆప్‎ను ఊడ్చేశారు

Delhi Assembly Election Results Bandi Sanjay
x

Bandi Sanjay: ఢిల్లీ ఎన్నికలు.. దూసుకుపోతున్న బీజేపీ..చీపురుతో ఆప్‎ను ఊడ్చేశారు

Highlights

Bandi Sanjay: ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ...

Bandi Sanjay: ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారని సంచలన కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్య బద్ధమైన పాలనను ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలను వద్దనుకున్నారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందు నుంచి మనం ఊహించిందే. మేధావి వర్గం అంతా కూడా మా పార్టీకే ఓట్లు వేశారు. తెలంగాణలో కూడా అధికారంలోకి రావడం ఖాయం. రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుంది. రాష్ట్రంలో మేధావి, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆలోచించి ఓట్లు వేయాలి. అసెంబ్లీలో మీ సమస్యలపై ప్రశ్నించేది బీజేపీ ఒక్కటే అంటూ బండి సంజయ్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories