Bhatti Vikramarka: పదవులు వచ్చినా పాత మిత్రులను మరువని భట్టి.. కుమారుడి పెళ్లిలో ఆదివాసీ మహిళలకు అరుదైన గౌరవం!

Bhatti Vikramarka: పదవులు వచ్చినా పాత మిత్రులను మరువని భట్టి.. కుమారుడి పెళ్లిలో ఆదివాసీ మహిళలకు అరుదైన గౌరవం!
x
Highlights

Bhatti Vikramarka: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తనయుడు సూర్య విక్రమాదిత్య - సాక్షిల వివాహ వేడుకలో ఒక అపురూప ఘట్టం చోటుచేసుకుంది.

Bhatti Vikramarka: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తనయుడు సూర్య విక్రమాదిత్య - సాక్షిల వివాహ వేడుకలో ఒక అపురూప ఘట్టం చోటుచేసుకుంది. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీల మధ్య.. నాడు భట్టి విక్రమార్కతో కలిసి అడుగులేసిన సామాన్య ఆదివాసీ మహిళలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

గత ఎన్నికలకు ముందు సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లా బోథ్ నుంచి ఖమ్మం వరకు నిర్వహించిన పాదయాత్రలో వీరంతా భాగస్వాములయ్యారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా​జైనూర్ మండలం బూసిమెట్టకు చెందిన వాలే లక్ష్మీబాయి, డాకూర్ రుక్మబాయి, దుర్గ సిందు, ఉట్నూరు మండలం దేవగూడకు చెందిన మరప గంగుబాయి, సుమన్ బాయి, సీడం లక్ష్మీబాయి.. వీరంతా పాదయాత్ర ఆద్యంతం ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా, ఎండ తీవ్రతకు భట్టి అలసిపోకుండా, ఆయన ఆరోగ్యం దెబ్బతినకుండా తమ సంప్రదాయ ఆదివాసీ పానీయాలను అందించి ఆత్మీయతను చాటుకున్నారు.

పదవులు వచ్చినా పాత మిత్రులను మరువని భట్టి విక్రమార్క, తన కుమారుడి వివాహానికి వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. వివాహ వేడుకకు హాజరైన ఆ ఆదివాసీ మహిళలను భట్టి దంపతులు ఆప్యాయంగా పలకరించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కేవలం అతిథులుగా మాత్రమే కాకుండా, వారికి వివాహ వేదికపైనే ప్రత్యేక స్థానం కల్పించి కూర్చోబెట్టడం అందరినీ ఆకట్టుకుంది. రాజకీయాల్లో మానవ సంబంధాలకు, కృతజ్ఞతకు ఈ ఘటన నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories