Rice Distribution: నేటి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ..ఆ జిల్లాల్లో మాత్రం ఇప్పుడే కాదు

Rice Distribution: నేటి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ..ఆ జిల్లాల్లో మాత్రం ఇప్పుడే కాదు
x
Highlights

Rice Distribution: నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ షురూ కానుంది. రెండు రోజుల క్రితం హుజూర్ నగర్ వేదికగా ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి...

Rice Distribution: నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ షురూ కానుంది. రెండు రోజుల క్రితం హుజూర్ నగర్ వేదికగా ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైంది సన్నబియ్యం పంపిణీ. నేటి నుంచి హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో షురూ కానుంది. రాష్ట్ర జనాభాలో 85శాతం మంది పేదలకు ప్రజాపంపిణీ వ్యవస్థ కింద నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ కానుంది.

రాష్ట్రంలో రేషన్ పంపిణీలో విప్లవాత్మక మార్పు నేటి నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో రేషన్ షాపుల ద్వారా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ షురూ కానుంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కుటుంబాలకు సంబంధించి ప్రతి ఒక్కరికీ 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఉగాది పండగను పురస్కరించుకుని మార్చి 30వ తేదీన సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం అయ్యింది. సోమవారం రంజాన్ పర్వదినం అనంతరం 1వ తేదీ ద్రుష్ట్యా మంగళవారం ఉత్సాహభరిత వాతావరణంలో ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల మీదుగా సన్న బియ్యం పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ రంగం సిద్ధం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories