వర్కింగ్ జర్నలిస్టులను విభజించొద్దు

వర్కింగ్ జర్నలిస్టులను విభజించొద్దు
x
Highlights

వర్కింగ్ జర్నలిస్టులను అక్రెడిటేషన్లు, మీడియా కార్డుల పేరుతో విభజించొద్దని డెస్క్ జర్నలిస్ట్స్​ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ(డీజేఎఫ్​టీ) రాష్ట్ర అధ్యక్షులు బాదిని ఉపేందర్, ప్రధాన కార్యదర్శి ఎస్‌కే మస్తాన్, కోరారు.

హైదరాబాద్: వర్కింగ్ జర్నలిస్టులను అక్రెడిటేషన్లు, మీడియా కార్డుల పేరుతో విభజించొద్దని డెస్క్ జర్నలిస్ట్స్​ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ(డీజేఎఫ్​టీ) రాష్ట్ర అధ్యక్షులు బాదిని ఉపేందర్, ప్రధాన కార్యదర్శి ఎస్‌కే మస్తాన్, కోరారు. డెస్క్ జర్నలిస్టులకు పాత పద్ధతిలోనే అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం లక్డీకాపూల్​లోని హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ పత్రికలకు చెందిన డెస్క్ జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు తీసేసి, మీడియా కార్డులు ఇవ్వడం సరికాదన్నారు. ఇది జర్నలిస్టుల పట్ల వివక్ష చూపినట్లు అవుతుందని స్పష్టం చేశారు. రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులు కలిస్తేనే జర్నలిజం అవుతుందని చెప్పారు. మీడియా కార్డుల పేరుతో డెస్క్ జర్నలిస్టులను రెండో గ్రేడ్​ వారిగా మర్చొద్దని చెప్పారు. అలాగే జీవో నంబర్ 252ను సవరించాలని, స్పోర్ట్స్, సినిమా, ఫీచర్స్, వెబ్, కల్చరల్, బిజినెస్, కార్టునిస్టులకు గతంలో లాగా అక్రెడిటేషన్ కార్డులివ్వాలని డిమాండ్​ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్‌ కదిరవన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కేవీ రాజారామ్, డీజేఎఫ్‌టీ కోశాధికారి నిసార్, జాయింట్ సెక్రటరీ విజయ తదితరులు పాల్గొన్నారు.

టీడబ్ల్యూజేఎఫ్, హెచ్‌యూజే, ఎస్​జాట్ మద్దతు

డీజేఎఫ్‌టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమానికి టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య, రాష్ట్ర నాయకులు రాజశేఖర్, హెచ్‌యూజే వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్, ప్రధాన కార్యదర్శి జగదీశ్ తదితరులు మద్దతు తెలిపారు. ఎస్​జాట్ తదితర జర్నలిస్టు సంఘాలు సైతం మద్దతు ప్రకటించాయి.

ఎవరూ ఆందోళన చెందొద్దు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ

డెస్క్ జర్నలిస్టులకూ గతంలోలాగే అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చేలా చూస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి హామీ ఇచ్చారు. డెస్క్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్‌టీ) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు శనివారం మహబూబాబాద్‌‌లో మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. వారి వెంట టీడబ్ల్యూజేఫ్ నేతలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వారు డెస్క్ జర్నలిస్టులకు సైతం అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. అలాగే డెస్క్ జర్నలిస్టుల పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వారి వినతులపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ డెస్క్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చారు. మంత్రిని కలిసిన వారిలో డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్‌టీ)కమిటీ కన్వీనర్ కాంకూరి వెంకటేశ్వరరావు, కోకన్వీనర్లు కేతిరెడ్డి అచ్చిరెడ్డి, వంశీ, శాబాదు కరుణాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories