ఇదెలా సాధ్యం అయిందిరా బాబూ.. కారును కాంపౌండ్ వాల్ ఎక్కించిన డ్రైవర్..

ఇదెలా సాధ్యం అయిందిరా బాబూ.. కారును కాంపౌండ్ వాల్ ఎక్కించిన డ్రైవర్..
x

ఇదెలా సాధ్యం అయిందిరా బాబూ.. కారును కాంపౌండ్ వాల్ ఎక్కించిన డ్రైవర్..

Highlights

కార్లు రాత్రి పూట ఇంటి షెడ్లలో, పార్కింగ్ ఏరియాల్లో పార్కింగ్ చేస్తారు గానీ ఈ డ్రైవర్ ఏంటి ఏకంగా కాంపౌండ్ గోడపైకే ఎక్కించేసాడు? ఇదెలా సాధ్యం అయిందబ్బా..అనే కదా మీ అందరు ఆలోచిస్తున్నారు. అవును.. ఒక వ్యక్తి రాత్రి పూట చాలా వేగంగా వచ్చి కాంపౌండ్ వాల్‌పైకి కారును ఎక్కించేశాడు.

కార్లు రాత్రి పూట ఇంటి షెడ్లలో, పార్కింగ్ ఏరియాల్లో పార్కింగ్ చేస్తారు గానీ ఈ డ్రైవర్ ఏంటి ఏకంగా కాంపౌండ్ గోడపైకే ఎక్కించేసాడు? ఇదెలా సాధ్యం అయిందబ్బా..అనే కదా మీ అందరు ఆలోచిస్తున్నారు. అవును.. ఒక వ్యక్తి రాత్రి పూట చాలా వేగంగా వచ్చి కాంపౌండ్ వాల్‌పైకి కారును ఎక్కించేశాడు. తీరా పొద్దున లేచి చూస్తే..

నిద్ర మత్తు సాధ్యం కాని పనిని అయినా ఈజీగా చేయించేస్తుంది. ఇదిగో ఈ సంఘటన చూస్తే మీకు అర్ధం అవుతుంది కదా. నిద్రమత్తులో ఒక డ్రైవర్ తన డ్రైవ్ చేస్తున్న కారును ఏకంగా ఒక ఇంటి గోడ ముందున్న కాంపౌండ్ గోడపైకి ఎక్కించేశాడు. అంతే ఆ కారులోనే నిద్రపోయాడు. కానీ పొద్దున లేచి చూసేసరికి కారు గోడపైన ఉంది. ఇక అప్పుడు పై ప్రాణాలు పైనే పోయాయనుకోండి.

సమాచారం తెలుసుకున్న పోలీసులు క్రేన్ సాయంతో కారును కిందకు దించారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో మీకు చెప్పలేదు కదూ. మన హైదరాబాద్ నగరంలోనే జరిగింది. దుండిగల్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కారు నడిపిన వ్యక్తి మేడ్చల్ జిల్లాకు చెందిన శంభీపూర్‌‌గా పోలీసులు గుర్తించారు. అయితే డ్రైవర్‌‌కు గాయాలవ్వడంతో అతన్ని హాస్పిటల్‌కు తరలించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories