TSRTC: ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో 'డైనమిక్‌ ప్రైసింగ్‌'.. రద్దీని బట్టి టిక్కెట్ ధరలు..

Dynamic Pricing System in TSRTC
x

TSRTC: ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో ‘డైనమిక్‌ ప్రైసింగ్‌’.. రద్దీని బట్టి టిక్కెట్ ధరలు..

Highlights

TSRTC: తెలంగాణ ఆర్టీసీ చేస్తున్న సంస్కరణలు ఒకొక్కటి మంచి ఫలితాలిస్తున్నాయి.

TSRTC: తెలంగాణ ఆర్టీసీ చేస్తున్న సంస్కరణలు ఒకొక్కటి మంచి ఫలితాలిస్తున్నాయి. దీంతో మరో కొత్త విధానాన్ని తీసుకోచ్చింది.. విమానాలు, పెద్ద పెద్ద హోటల్స్‌లో ఉండే ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ లో డైనమిక్ ప్రైసింగ్ సిస్థంను ప్రవేశపెట్టింది. దీని ద్వారా విమానాల ఛార్జీల మాదిరి రద్ధి సమయాల్లో ఆన్ లైన్ టికెట్ రేట్లు భారీగా పెరగనున్నాయి. ఆర్టీసీ టికెట్ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇప్పటి వరకూ ప్రవేశపెట్టిన విధానాల్లో చేస్తున్న డైనమిక్ ప్రైసింగ్ భిన్నమైనది.

తెలంగాణ ఆర్టీసీ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చూడుతోంది. టికెట్ ఆదాయాన్ని పెంచుకోవడానికి దూర ప్రాంత ప్రయాణికులు ఆర్టీసీ వైపు వచ్చేలా ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో 'డైనమిక్‌ ప్రైసింగ్‌' విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఫైలట్‌ ప్రాజెక్ట్‌గా బెంగళూరు మార్గంలో నడిచే 46 సర్వీసుల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. హైదరాబాద్‌, వరంగల్, కరీంనగర్‌, ఖమ్మం నుంచి బెంగళూరులకు వెళ్లే సర్వీసుల్లో డైనమిక్‌ ప్రైసింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

ప్రయాణికుల రద్దీని బట్టి టికెట్‌ ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయన్నారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్. డైనమిక్‌ ప్రైసింగ్‌ విధానంలో అడ్వాన్స్‌డ్‌ డేటా అనాలసిస్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్స్‌ మార్కెట్‌లోని డిమాండ్‌ను బట్టి చార్జీలను నిర్ణయిస్తాయన్నారు. ప్రైవేట్‌ ఆపరేటర్లు, ఇతర రాష్ట్రాల ఆర్టీసీ బస్సుల బుకింగ్‌లతో పోల్చి టికెట్‌ ధరను వెల్లడిస్తాయని సజ్జనార్ తెలిపారు.

సాధారణ రోజుల్లోనూ ప్రైవేట్‌ ఆపరేటర్లు అధికంగా ఛార్జీలు వసూలుచేస్తున్నారు. రద్దీ రోజుల్లో అయితే టికెట్ల ధరలు ఇష్టానుసారంగా పెంచుతున్నారు. ప్రైవేట్‌ పోటీని తట్టుకుని ప్రజలకు మరింతగా చేరువయ్యేందుకు ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో డైనమిక్‌ ప్రైసింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ విధానం వల్ల రద్దీ తక్కువగా ఉన్నప్పుడు సాధారణ చార్జీ కన్నా 20 నుంచి 30 శాతం వరకూ టిక్కెట్ ధర తక్కువగా ఉంటుంది. ఒకవేళ రద్దీ ఎక్కువగా ఉంటే సాధారణ చార్జీ కన్నా డిమాండ్‌ బట్టి 25 శాతం వరకు ఎక్కువగా టిక్కెట్ ధర ఉంటుంది." ఆన్‌లైన్ బుకింగ్‌ విధానం ద్వారా ప్రయాణికులు తమకు నచ్చిన సీటును బుక్‌ చేసుకోవచ్చు సర్వీస్‌ ప్రారంభమయ్యే గంట ముందు వరకు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి తెలిపారు. టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ సదుపాయం 60 రోజుల వరకూ కల్పిస్తున్నామని గుర్తు చేశారు. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ www.tsrtconline.in లో టికెట్లను బుక్‌ చేసుకోవాలని సూచించారు.

ఆర్టీసీ లో అమలవుతున్న సంస్కరణలు ఫలితాలిస్తుండటంతో గతంలో కన్నా ఆదాయం సైతం భారీగా పెరుగుతుంది. ఇప్పుడు తాజాగా తీసుకోచ్చిన డైనమిక్ ప్రైసింగ్ అనేది పండగల సమయాల్లో ప్రయాణికులపై భారం పడే అవకాశముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories