వృద్ధ దంపతుల పట్ల ప్రైవేట్ లోన్ ఏజెన్సీ కర్కషత్వం.. లోన్ కట్టలేదని ఇంటికి తాళం వేసిన లోన్ ఏజెన్సీ

వృద్ధ దంపతుల పట్ల ప్రైవేట్ లోన్ ఏజెన్సీ కర్కషత్వం.. లోన్ కట్టలేదని ఇంటికి తాళం వేసిన లోన్ ఏజెన్సీ
x

వృద్ధ దంపతుల పట్ల ప్రైవేట్ లోన్ ఏజెన్సీ కర్కషత్వం.. లోన్ కట్టలేదని ఇంటికి తాళం వేసిన లోన్ ఏజెన్సీ

Highlights

వృద్ధ దంపతుల పట్ల ఓ ప్రైవేట్ లోన్ ఏజెన్సీ కర్కషంగా ప్రవర్తించింది. లోన్ కట్టలేదని వృద్ధ దంపతులను ఇంట్లో నుంచి బయటకు పంపించేసి ఇంటికి తాళం వేశారు.

వృద్ధ దంపతుల పట్ల ఓ ప్రైవేట్ లోన్ ఏజెన్సీ కర్కషంగా ప్రవర్తించింది. లోన్ కట్టలేదని వృద్ధ దంపతులను ఇంట్లో నుంచి బయటకు పంపించేసి ఇంటికి తాళం వేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా మల్లారంలో జరిగింది. ఇంటికి తాళం వేయడంతో వృద్ధ దంపతులు రోడ్డున పడ్డారు. న్యాయం కోసం ఆ దంపతులు పీఎస్‌ను ఆశ్రయించారు. కుమారుడు చేసిన అప్పుకు తాము రోడ్డున పడాల్సి వచ్చిందని వారు వాపోయారు.

సిరిసిల్లా జిల్లా మల్లారం గ్రామానికి చెందిన రాజయ్య , పోచవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా చిన్న కుమారుడు ఇళ్లును తన పేరు మీదికి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తల్లిదండ్రులకు తెలియకుండా ఆ ఇంటిపై లోన్ తీసుకున్నాడు చిన్న కుమారుడు శ్రీను. ఏడాది కాలంగా లోన్ కట్టకపోవడంతో లోన్ ఏజెన్సీ నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో కంపెనీ వారు ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న వృద్ధులను బయటకు తరమేసి... సామాగ్రిని బయట పడేసి తాళం వేశారు.

14 లక్షలు కడితేనే ఇంట్లోకి అనుమతి ఇస్తామని ప్రైవేట్ లోన్ కంపెనీ వారు తేల్చి చెప్పారు. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ వృద్ధ దంపతులు వేములవాడ రూరల్ పీఎస్‌ను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరారు. తమ కుమారుడు చేసిన పనికి తాము రోడ్డున పడ్డామని వాపోయారు. రెండు రోజులుగా ఇంటి ముందే ఉంటున్నామని చలికి తట్టుకోలేకపోతున్నామి విలపించారు. సమస్య కోర్టు పరిధిలో ఉండటంతో తాము ఏమి చేయలేమని పోలీసులు చేతులెత్తేశారు. న్యాయపరంగా సమస్య పరిష్కరించుకోవాలని వారికి సూచించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ వృద్ధ దంపతులు విలపిస్తున్న తీరు స్థానికులను కలిచివేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories