ఎన్నికల అధికారుల తప్పిదం.. మహిళా రిజర్వ్ స్థానంలో పురుషుల నామినేషన్లు

ఎన్నికల అధికారుల తప్పిదం.. మహిళా రిజర్వ్ స్థానంలో పురుషుల నామినేషన్లు
x
Highlights

సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఎన్నికల అధికారులు చేసిన తప్పిదం ఇద్దరు అభ్యర్థులకు శాపంగా మారింది.

సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఎన్నికల అధికారులు చేసిన తప్పిదం ఇద్దరు అభ్యర్థులకు శాపంగా మారింది. సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం గ్రామానికి చెందిన ఐదవ వార్డ్ బిసి మహిళకు రిజర్వుడ్ స్థానాన్ని కేటాయించారు. బీసీ మహిళ రిజర్వుడ్ వార్డులో మహిళ నామినేషన్ తో పాటు పురుషుల నామినేషన్లు కూడా ఎన్నికల అధికారులు స్వీకరించారు. కనకంటి రేవంత్, గౌతమ్ కుర్మా.. సమర్పించిన నామినేషన్లు ఐదవ వార్డులోని బిసి మహిళ రిజర్వుడు స్థానంలో ఎన్నికల అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయకుండా స్వీకరించడం చర్చ నీ అంశంగా మారింది. ఈ వార్డు మహిళ రిజర్వుడు స్థానమని స్కూటీనిలో ఇద్దరి నామినేషన్లు రిజెక్ట్ చేయడంతో ఇద్దరు అభ్యర్థులు కంగుతిన్నారు.

ఐదవ వార్డు బీసీ జనరల్ రిజర్వుడ్ అని అధికారులు అనడంతోనే నామినేషన్ దాఖలు చేశామని బాధితులు అంటున్నారు. అధికారుల తప్పుడు సమాచారంతోనే తమకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అధికారులు మాత్రం నామినేషన్లు స్వీకరించే సమయంలో జనాలు ఎక్కువగా రావడంతో అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించకుండానే తీసుకున్నామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి లక్ష్మణ్ అన్నారు. అభ్యర్థులు నామినేషన్లు పరిశీలించకుండా తీసుకోవడం వల్లే ఈ తప్పిదం జరిగిందంటూ వెల్లడించారు. ఘటనపై బాధితుడు రేవంత్ జిల్లా కలెక్టర్, ఆర్డీవోకు ఫిర్యాదు చేశాడు. దీంతో జిల్లా అధికారులు అల్లాదుర్గం ఎన్నికల నిర్వహణ అధికారి లక్ష్మణ్ ను, ఎంపీడీవో ను మెదక్ ఆర్డీవో కార్యాలయానికి రావాలంటూ ఆదేశించారు. ఇక ఆ స్థానానికి నామినేషన్లు సమర్పించిన మరో మహిళ అభ్యర్థి చంద్రకళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories