సుప్రీంకోర్టు ఆదేశాలతో నిలిచిపోయిన మంగపేట ఎన్నికలు

సుప్రీంకోర్టు ఆదేశాలతో నిలిచిపోయిన మంగపేట ఎన్నికలు
x

సుప్రీంకోర్టు ఆదేశాలతో నిలిచిపోయిన మంగపేట ఎన్నికలు

Highlights

ములుగు జిల్లా మంగపేట మండలంలో ఎన్నికలకు బ్రేక్‌ సుప్రీంకోర్టుకు వెళ్లిన షెడ్యూల్డ్‌, నాన్‌ షెడ్యూల్డ్‌ వివాదం మంగపేట మండలంలో 23 గ్రామాలకు స్థానిక ఎన్నికలు లేనట్టే 14 ఏండ్లుగా స్థానిక ఎన్నికలకు మంగపేట ప్రజలు దూరం షెడ్యూల్డ్ గ్రామాలుగా గుర్తించొద్దంటూ సుప్రీం తాజా ఆదేశాలు మధ్యంతర ఉత్తర్వులతో నిలిచిన ఎలక్షన్ ప్రక్రియ

ములుగు జిల్లా మంగపేట మండల ప్రజలకు 14 ఏళ్లుగా ఓటు వేసే హక్కు లేకుండాపోయింది. 2011 నుంచి సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించకపోగా.. ప్రత్యేక అధికార పాలన కిందే ఈ గ్రామాలు ఉండిపోయాయి. గిరిజన, గిరిజనేతరుల మధ్య రిజర్వేషన్​ వివాదం కోర్టులో ఉండగా ఇటీవల సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువరిస్తూ ఆ 23గ్రామాలపై క్లారిటీ ఇచ్చింది. సుప్రీం కోర్టులో మంగపేట స్థానిక ఎన్నికలకు సంబంధించి 2026, ఫిబ్రవరి 16న ఫైనల్​ హియరింగ్​ ఉండటంతో ఎంపీపీ ఎన్నికలను మాత్రం వాయిదా వేసింది.


ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ విడుదల చేసిన ప్రకటనలో మంగపేట మండలానికి సంబంధించి జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు. కానీ కోర్టు ఉత్తర్వుల మేరకు ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు జరగవని తేల్చారు. రెండు రోజుల క్రితం చేపట్టిన రిజర్వేషన్లలో మంగపేట ఎంపీపీ, ఎంపీటీసీ రిజర్వేషన్లను ఖరారు చేయలేదు. కానీ, జడ్పీటీసీ స్థానాన్ని జనరల్‌గా కేటాయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories