ఢీ అంటే ఢీ: సర్పంచ్ ఎన్నికల్లో అన్నదమ్ముల పోటీ

ఢీ అంటే ఢీ: సర్పంచ్ ఎన్నికల్లో అన్నదమ్ముల పోటీ
x

ఢీ అంటే ఢీ: సర్పంచ్ ఎన్నికల్లో అన్నదమ్ముల పోటీ

Highlights

స్థానిక పోరులో కుటుంబ పంచాయితీలు భద్రాద్రి జిల్లా కొత్తూరులో అన్నదమ్ముల పోటీ విస్తృతంగా సోదరుల ప్రచారం గ్రామాభివృద్ధికి కృషి చేస్తామంటూ హామీలు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు కుటుంబాల్లో పంచాయితీలు పెడుతున్నాయి. అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్లు, అత్తా కోడలు, ఆడి బిడ్డలు, మామ కోడలు... ఇలా వరుసలేవి కావు రాజకీయాలకు అతీతంగా అన్నట్లు బంధుత్వాలను బంధాలను చెరిపివేసే విచిత్ర రాజకీయం నేడు రాష్ట్రంలో కనిపిస్తుంది.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొత్తూరు గ్రామపంచాయతీ సర్పంచ్‌ బరిలో అన్నదమ్ములే ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నారు. సీపీఐ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా అన్న అక్కుల రాములు బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ బలపరిచిన అభ్యర్థిగా తమ్ముడు అక్కుల నర్సింహారావు పోటీ చేస్తున్నాడు. ఒక తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములు ప్రత్యర్థులుగా మారి ఢీ అంటే ఢీ అంటూ పోటీ పడుతున్నారు.


ఇద్దరు అన్నదమ్ములు ఒకరిని మించి ఇంకొకరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అన్న రాములు గ్రామాల్లో ప్రతి ఇంటికి తిరుగుతూ తనను గెలిపిస్తే గ్రామంలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తానని హామీ ఇస్తున్నారు. ప్రజలకు అన్నివేళలో అందుబాటులో ఉంటానని హామీలు ఇస్తూ ప్రచారాన్ని మమ్మరం చేస్తున్నారు. తమ్ముడు నర్సింహారావు గ్రామం అభివృద్ధికి శక్తివంచన లేకుండా పని చేస్తానంటున్నారు.


ఇలా తమకు తోచిన విధంగా అన్నదమ్ములు ఇద్దరు గెలుపు కోసం ఓటర్లకు హామీలు ఇస్తూ తమ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఓటరు మహాశయులు ఎవరి వైపు మొగ్గుచూపి ఈ అన్నదమ్ముల ఇద్దరిలో ఎవరిని గెలిపిస్తారో అని మండల వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. రాజకీయాలు శాశ్వతం కావని, ప్రత్యర్థులుగా బరిలోకి దిగి కుటుంబాల్లో కలహాలను ఏర్పరచుకొని శాశ్వతంగా తమ బంధుత్వ బాంధవ్యాలకు దూరం కాకుండా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు..

Show Full Article
Print Article
Next Story
More Stories