నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు, రంగంలోకి 5 ఫైరింజన్లు!

Hyderabad: నగరంలోని కీలకమైన నాంపల్లి స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL)లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Hyderabad: నగరంలోని కీలకమైన నాంపల్లి స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL)లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనం నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అసలేం జరిగిందంటే?
ల్యాబ్‌లోని మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్‌లో తొలుత మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు భవనంలోని ఇతర ప్రాంతాలకు వేగంగా వ్యాపించాయి. లోపల ఉన్న కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోవడంతో ఆ ప్రాంతమంతా నల్లటి పొగ అలుముకుంది. ప్రమాదాన్ని గమనించిన కార్యాలయ సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రస్తుతం ఐదు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఘటన గురించి తెలియగానే నార్త్‌జోన్ డీఐజీ శ్వేత, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ల్యాబ్‌కు చేరుకున్నారు. అగ్నిమాపక చర్యలను పర్యవేక్షిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ల్యాబ్‌లో కీలకమైన కేసులు, ఫోరెన్సిక్ ఆధారాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏమైనా దెబ్బతిన్నాయా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.
ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత ఆస్తి నష్టంపై స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



