హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్‌.. కేసీఆర్‌ ఫ్లెక్సీలపై మోడీ ఫ్లెక్సీలు!

Flexi War Going on Between BJP and TRS in Hyderabad
x

హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్‌.. కేసీఆర్‌ ఫ్లెక్సీలపై మోడీ ఫ్లెక్సీలు!

Highlights

Hyderabad: హైదరాబాద్‌లో ఫ్లెక్సీ వార్‌ కొనసాగుతోంది.

Hyderabad: హైదరాబాద్‌లో ఫ్లెక్సీ వార్‌ కొనసాగుతోంది. బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య ఫ్లెక్సీ వివాదం తారాస్థాయికి చేరుకుంది. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు మెట్రో పిల్లర్లకు ఉన్న కేసీఆర్‌ ఫ్లెక్సీలపై మోడీ ఫ్లెక్సీలను అతికించారు బీజేపీ కార్యకర్తలు. ఈ ఘటనపై గులాబీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ లో చాలా చోట్ల బీజేపీ, టీఆర్ఎస్ కు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీ సహా అమిత్ షా, నడ్డాతో పాటు పార్టీ కీలక నేతలందరూ హైదరాబాద్ కు వచ్చారు. ఇదే క్రమంలో బీజేపీ కార్యవర్గ సమావేశాలకు పోటీగా టీఆర్ఎస్ కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వచ్చిన సందర్భంగా నగరంలో చాలాచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories