Banoth Madanlal: మాజీ ఎమ్మెల్యే గుండెపోటుతో కన్నుమూత

Former Vaira MLA Banoth Madan Lal passes away due to heart attack
x

Banoth Madanlal: మాజీ ఎమ్మెల్యే గుండెపోటుతో కన్నుమూత

Highlights

Banoth Madanlal: వైరా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ బాణోత్ మదన్ లాల్ మరణించారు. నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన...

Banoth Madanlal: వైరా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ బాణోత్ మదన్ లాల్ మరణించారు. నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. గతవారం ఖమ్మంలోని ఆయన నివాసంలో వాంతులు విరేచనలు కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అయితే మెరుగైన వైద్యం కోసం ఏఐజీ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మరణించినట్లు బంధువులు తెలిపారు. మదన్ లాల్ మ్రుతితో వైరా నియోజకవర్గం వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్, ఇతర పార్టీల నాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

కాగా 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున వైరా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. 2018, 2023 ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో వైరా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories