Formula E Race Case: ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్‌

Formula E Race Case KTR ACB Inquiry
x

Formula E Race Case: ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్‌

Highlights

Formula E Race Case: భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కే. తారకరామారావు (కేటీఆర్) ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు.

Formula E Race Case: భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కే. తారకరామారావు (కేటీఆర్) ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయనకు ఏ1 నిందితుడిగా గుర్తింపు ఉంది. ప్రభుత్వ అనుమతులు లేకుండానే విదేశీ సంస్థకు నగదు చెల్లించినట్టు ఆరోపణలు రావడంతో, విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో కూడా కేటీఆర్ ఏసీబీ అధికారుల ఎదుట హాజరై వివరాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కార్యాలయం చుట్టూ భారీగా పోలీసులను మోహరించి, బారికేడ్లతో చుట్టేశారు. మీడియా ప్రతినిధులు, ఇతరులకు అనుమతి ఇవ్వడం లేదు. కేటీఆర్‌తో పాటు ప్రముఖ న్యాయవాది రామచందర్ రావు కూడా విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఏసీబీ అధికారుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories