GHMC: గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించడం సాధ్యమేనా..? దానికి చట్టబద్ధత ఉంటుందా...?

GHMC: గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించడం సాధ్యమేనా..? దానికి చట్టబద్ధత ఉంటుందా...? దేశ వ్యాప్తంగా సర్ కొనసాగుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవచ్చా..?
GHMC: గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించడం సాధ్యమేనా..? దానికి చట్టబద్ధత ఉంటుందా...? దేశ వ్యాప్తంగా సర్ కొనసాగుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవచ్చా..?
గ్రేటర్‌ను మూడు కార్పొరేషన్లు విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్కార్పొరేషన్గా ఏర్పాటైంది. ప్రభుత్వ కార్పొరేషన్ల విభజన నేపథ్యంలో ఫ్రీజింగ్ అంశం తెరపైకి వచ్చింది. పాలనాపరమైన అవసరాల కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ఫ్రీజింగ్ ఆపలేదంటున్నారు అధికారులు. జనగణనలో పరిపపాలన సరిహద్దులను ఒక నిర్దిష్ట తేదీకి స్థిరంగా నిలిపివేయడాన్ని సెన్సస్ ఫ్రీజింగ్‌గా పరిగణిస్తారు.
తెలంగాణలో 2025 డిసెంబర్ 31 నుంచి సెన్సస్ ఫ్రీజింగ్ అమలులోకి వచ్చింది. జనగణన సమయంలో సరిహద్దుదుల మారితే జనాభా లెక్కల్లో ఇబ్బంది ఎదురవుతుంది. అందుకే కచ్చితమైన లెక్కల కోసం ఫ్రీజింగ్ తేదీని నిర్ణయిస్తారు. పరిపాలన అవసరాల రీత్యా ఏర్పాటు చేసే కొత్త కార్పొరేషన్లకు సెన్సస్ ఫ్రీజింగ్ ఇబ్బంది కాదని అధికారులు చెబుతున్నారు.
అయితే జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన వెంటనే ఎన్నికలకు వెళ్తారా...? లేదా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికలకు ఆరు నెలల సమయం పట్టే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా కలిసే మున్సిపాలిటీల్లో మౌలిక వసతులు లేవు. కొన్ని కాలనీలకు రహదారులు, డ్రైనేజీలు లేవు. వీధి దీపాలు వెలగడం లేదు. నీటి సరఫరా, చెత్త సేకరణ, రహదారులు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్లే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



