Telangana: రైతులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. తక్కువ ధరకే ఎరువుల విక్రయం..

Farmers
x

Farmers

Highlights

Good news For farmers: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది అది తక్కువ ధరలకే వారికి ఎరువులను అందించేలా కీలక నిర్ణయం తీసుకుంది.

Good news For farmers: రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. అది తక్కువకే ఎరువులను అందించేలా కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 37,216 కోట్ల సబ్సిడీని ఆమోదించింది. ఇది రైతులకు గుర్తించని చెప్పాలి. ఖరీఫ్ సీజన్లో ఫాస్పరస్‌, పొటాషియం ఆధారిత ఎరువులను రైతులకు తక్కువ ధరకే విక్రయించేలా చర్యలు తీసుకుంటుంది. దీంతో రైతులకు తక్కువ ధరలోనే ఈ ఎరువులు లభించడంతోపాటు దీని అందుబాటులో కూడా ఉంచారు.

కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ కేటాయింపులో రూ.1,91,836 కోట్లకు పైగా ఎరువుల శాఖకు కేటాయింపులు పెంచిన సంగతి తెలిసిందే. ప్రధానంగా రైతులకు డిఏపి సజావుగా అందించేలా చూస్తోంది. కేంద్ర ప్రభుత్వం కేంద్ర రసాయన ఎరువుల శాఖామంత్రి అనుప్రియ పటేల్ ఈ మేరకు పేర్కొన్నారు. డీఏపీ ఎరువుల ధరలను స్థిరంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. అంతేకాకుండా రైతులకు పంట ఉత్పత్తిలో ఎరువులను అందుబాటులో ఉంచటంతో వారికి భారీ ఉపశమనం లభిస్తుంది. తక్కువ ధరలోనే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ ఎరువుల వల్ల రైతులకు అధిక భారం పడకుండా ఉంటుందని అని చెప్పారు.

ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆహార భద్రతను మెరుగు లక్ష్యంగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ఎరువుల ధరల్లో జరిగిన మార్పులు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 31 వరకు పొటాషియం, ఫాస్ఫరస్ ఎరువులను సబ్సిడీ వర్తించనుంది. ఈ నేపథ్యంలో రైతులకు అతి తక్కువ ధరలోనే వారికి ఎరువులు లభిస్తాయి. దీంతో వాళ్ళు తమ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories