KTR Formula E-Race: ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు బిగ్ షాక్

KTR Formula E-Race: ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు బిగ్ షాక్
x

 KTR Formula E-Race: ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు బిగ్ షాక్

Highlights

ఫార్ములా ఈ-రేస్‌ కేసులో కీలక పరిణామం ఫార్ములా ఈ-రేస్‌ కేసులో కేటీఆర్‌ విచారణకు గవర్నర్‌ అనుమతి ఫార్ములా ఈ-రేస్‌ లావాదేవీల విషయంలో కేటీఆర్‌పై అభియోగాలు రూ.54 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్టు ఆరోపణలు

ఫార్ములా ఈ-రేస్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫార్ములా ఈ-రేస్‌ కేసులో కేటీఆర్‌ విచారణకు తెలంగాణ గవర్నర్‌ అనుమతించారు. ప్రజాప్రతినిధి కావడంతో కేటీఆర్‌ను విచారించేందుకు అనుమతి కోరుతూ గవర్నర్‌కు ఏసీబీ అధికారులు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఫార్ములా ఈ-రేస్‌ లావాదేవీల విషయంలో కేటీఆర్‌పై అభియోగాలు ఉన్నాయి. 54 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం జరిగినట్టు ఆరోపణలపై విచారణకు గవర్నర్‌ అనుమతిచ్చారు. ఈ విచారణ అనంతరం కేటీఆర్‌పై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసే ఛాన్స్ ఉంది. ఫార్ములా ఈ-రేస్‌ కేసులో ఏసీబీ, ఈడీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. రెండుసార్లు ఏసీబీ, ఒకసారి ఈడీ విచారణ ఎదుర్కొన్నారు కేటీఆర్. గత ఏడాది డిసెంబర్‌ 19న కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయగా.. సెప్టెంబర్‌ 9న గవర్నర్‌కు లేఖరాశారు ఏసీబీ అధికారులు. అయితే.. 70 రోజుల తర్వాత గవర్నర్‌ నుంచి కేటీఆర్‌ విచారణకు అనుమతి లభించింది. ఫార్ములా ఈ-రేస్‌ కేసులో A1గా కేటీఆర్‌ ఉండగా.. A2గా అరవింద్‌కుమార్‌ ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories