మరికొంత ఆలస్యం కానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు

Gram Panchayat Elections to be Delayed Further
x

మరికొంత ఆలస్యం కానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు

Highlights

Gram Panchayat Elections 2024: గ్రామ పంచాయతీ ఎన్నికలు మరికొంత ఆలస్యం కానున్నాయి.

Gram Panchayat Elections 2024: గ్రామ పంచాయతీ ఎన్నికలు మరికొంత ఆలస్యం కానున్నాయి. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినా, బీసీ రిజర్వేషన్లు తేలకపోవడంతో మరింత ఆలస్యం కానున్నాయి. పంచాయతీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఓటర్ లిస్టును సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.. బీసీ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా ఎప్పుడు... ఎన్నికలు నిర్వహించాలో డిసైడ్ చేయనుంది ప్రభుత్వం.

6 నెలలుగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలనుకుంటుంది ప్రభుత్వం... పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొత్త ఓటరు జాబితాను ఆగస్టు మొదటివారంలోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి... ఓటరు జాబితా పూర్తయిన వెంటనే నిర్దిష్ట గడువులోగా రిపోర్ట్ ఇవ్వాలని బీసీ కమిషన్‌ను ఆదేశించారు. బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం..

6 నెలలుగా పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులు రావడం లేదు. దీంతో ప్రభుత్వం వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలనుకుంటోంది.. అయితే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఎదుట అనేక సవాళ్లు ఉన్నాయి. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం బీసీ కులగణన చేసి రిజర్వేషన్లు పెంచాల్సి ఉంటుంది. బీసీ కులగణనకు ప్రభుత్వం 150 కోట్లు కేటాయించింది.. కానీ బీసీ కులగణన ఇంకా పూర్తి కాలేదు.. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నా.. కాంగ్రెస్ హామీ ఇచ్చింది కాబట్టి కొత్త రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

ఓటరు జాబితా సిద్ధం చేసి, బీసీ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడానికి మరో 45 రోజుల సమయం పట్టనుంది.. బీసీ కులగణన చేసి, రిజర్వేషన్లు కేటాయించడానికి మరో 2 నెలలు పట్టే అవకాశం ఉంది.. అంటే పంచాయతీ ఎన్నికలు నవంబర్ లేదా డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది. మొత్తంగా కొంత ఆలస్యమయినా తాము ఇచ్చిన హామీ మేరకు కొత్త రిజర్వేషన్ల ప్రకారమే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించనుందేని స్పష్టమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories