Loan App: హైదరాబాద్‌‌లో కొనసాగుతున్న లోన్‌యాప్ ఏజెంట్ల వేధింపులు.. మరో యువకుడు బలి

Harassment Of Loanapp Agents In Hyderabad
x

Loan App: హైదరాబాద్‌‌లో కొనసాగుతున్న లోన్‌యాప్ ఏజెంట్ల వేధింపులు.. మరో యువకుడు బలి 

Highlights

Loan App:హైదరాబాద్ లో లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు.

Loan App: హైదరాబాద్ లో లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. తీసుకున్న రుణానికి EMI చెల్లించకపోవడంతో యాప్ ఏజెంట్లు ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. కుటుంబ సభ్యులు, బంధువులకు ఫోన్ చేసి చెప్పడంతో ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తగూడెం పట్టణానికి చెందిన శీలం మనోజ్ దుండిగల్ ఏరోనాటిక్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల లోన్ యాప్ ద్వారా కొంత మొత్తం లోన్ తీసుకున్నాడు. ఈ లోన్ EMI సకాలంలో చెల్లించలేకపోయాడు.

దీంతో లోన్ యాప్ ఏజెంట్లు ఫోన్ చేసి బెదిరింపులకు గురిచేయడంతో మనోజ్ ఆవేదనకు గురయ్యాడు. కుటుంబ సభ్యులకు, బంధువులు, స్నేహితులకు లోన్ యాప్ ఏజెంట్లు ఫోన్ చేశారు. ఈ విషయం తెలియడంతో పరువు పోయిందని మనస్తాపానికి గురైన మనోజ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. మనోజ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories