Harish Rao Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన హరీష్‌రావు.. జూబ్లీ పీఎస్ వద్ద భారీ బందోబస్త్

Harish Rao Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన హరీష్‌రావు.. జూబ్లీ పీఎస్ వద్ద భారీ బందోబస్త్
x

Harish Rao Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన హరీష్‌రావు.. జూబ్లీ పీఎస్ వద్ద భారీ బందోబస్త్

Highlights

Harish Rao Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్‌రావు సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.

Harish Rao Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు సిట్ విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ నేతలు, తన న్యాయవాదులతో కలిసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న హరీష్‌రావు, ఉదయం 11 గంటల సమయంలో సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు.

హరీష్‌రావు విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌లోకి అనుమతించలేదు. అలాగే హరీష్‌రావు న్యాయవాదులను కూడా లోపలికి అనుమతించకుండా, విచారణకు హరీష్‌రావును మాత్రమే అనుమతించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌రావు పాత్రపై ఓ ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సిట్ అధికారులు సోమవారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఆరుగురు అధికారులతో కూడిన సిట్ బృందం కీలక అంశాలపై హరీష్‌రావును విచారిస్తోంది. ఈ విచారణలో జాయింట్ సీపీ విజయ్‌కుమార్, ఏసీపీ వెంకటగిరి, డీసీపీ రీతిరాజ్‌లతో పాటు మరో ముగ్గురు సిట్ అధికారులు పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా, పోలీస్ స్టేషన్‌లోకి అనుమతించని నేపథ్యంలో హరీష్‌రావు న్యాయవాది మీడియాతో మాట్లాడారు. ఈ కేసుతో హరీష్‌రావుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్ని గంటలు విచారించినా కొత్తగా ఏమీ తేలదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే హైకోర్టు ఈ కేసును ఫాల్స్ కేసుగా పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు.

సిట్ విచారణకు హాజరయ్యే ముందు తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన హరీష్‌రావు, అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇలాంటి చర్యలకు తాము భయపడబోమని స్పష్టం చేశారు.



Show Full Article
Print Article
Next Story
More Stories