Harish Rao: ఓటు అంటే మూడు ఒద్దుల ముచ్చటకాదు, ఐదుఏళ్ల జీవితం

Harish Rao: కాంగ్రెస్ హయాంలో యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టారు

Shekhar G
Published on: 20 Nov 2023 6:29 PM IST
Harish Rao Comments On Congress
X

Harish Rao: ఓటు అంటే మూడు ఒద్దుల ముచ్చటకాదు, ఐదుఏళ్ల జీవితం

Harish Rao: ఓటు అంటే మూడోద్దుల మురిపం కాదు. ఐదేళ్ల భవిత, భవిష్యత్తు అన్నారు మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ కు మద్దతుగా, గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో హరీష్ రావు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో అందరూ వస్తుంటారు పోతుంటారు.. లేని పోనివి చెబుతుంటారు... ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. కాంగ్రెస్ హయాంలో యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టేవారని.. అర్ధరాత్రి కరెంట్ తో రైతులు మోటార్ పెట్టడానికి పోయి పాముకాటు,విద్యుత్ షాక్ తో ఎందరో మరణించారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ నాయకులు 5గంటల కరెంట్ ఇస్తున్నారన్న హరీష్.. 24 గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాలా, 5గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచన చెయ్యాలని కోరారు. తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష అని.. 30న అందరూ కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ ను దీవించండని కోరారు.

Shekhar G

Shekhar G

Next Story