Harish Rao: రేవంత్ మాట్లాడితే చిన్నపిల్లలు చెడిపోతారని ఇంట్లో తల్లిదండ్రులు టీవీలు బంద్ చేస్తున్నారు

Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు తీవ్ర విమర్శలు చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 30 Oct 2024 4:45 PM IST
Harish Rao
X

Harish Rao

Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. మీడియాతో చిట్ చాట్‌ సందర్భంగా రేవంత్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌ ఏం మాట్లాడుతున్నారో ఆయనే తెలియడంలేదని అన్నారు. రేవంత్‌రెడ్డి మాట్లాడితే చిన్నపిల్లలు చెడిపోతారని ఇంట్లో తల్లిదండ్రులు టీవీలు బంద్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

హైదరాబాద్‌కు మూడు వైపులా సముద్రం ఉందని మాట్లాడటంతో సోషల్ మీడియాలో రేవంత్‌పై జోకులు పేలుతున్నాయని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేయకుండా సాకులు చెబుతున్నారని ఫైరయ్యారు. కేసీఆర్ భిక్షతో రేవంత్ సీఎం అయ్యారంటూ హరీష్‌రావు విమర్శించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story